చేసినవి పట్టుమని పుంజీడు సినిమాలు లేవు కానీ, రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ బాగానే పెరుగుతోంది. యమలీల సినిమా అంత పబ్లిసిటీ చేసినా, రఫ్ చిత్రానికి ఓపెనింగ్స్ రావడానికి కారణం రకులే నట. కరెంటు తీగలో కూడా క్యూట్ గా కనిపించి, కుర్రకారు హాట్ ఫేవరెట్ గా మారిపోయిందట.
పవన్ వంటివాడే రకుల్ ను తన సినిమాకు సెకెండ్ హీరోయిన్ గా బుక్ చేయమని చెప్పాడంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి రకుల్ చేతిలో రామ్ పండగచేస్తో, రవితేజ కిక్ 2 వున్నాయి. ఓ బాలీవుడ్ సినిమా కూడా ఆమె ఖాతాలో వుంది.
లక్ ఎక్కడ వుంటే దాని వెంట వుండే టాలీవుడ్ జనాలు ఇప్పుడు రకుల్ ను తమ సినిమాలకు సంప్రదిస్తున్నారట. ఇద్దరు యువ హీరోలు తమ అప్ కమింగ్ ప్రాజెక్టులకు రకుల్ పేరే సూచించారని వినికిడి. నిజానికి ఇప్పుడు యంగ్ హీరోయిన్ల కొరత తెలుగులో చాలా వుంది.