Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రకుల్ ను దాచేసారెందుకో?

మన్మధుడు 2.. హీరో నాగార్జున లేటెస్ట్ మూవీ. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ రకుల్ ప్రీత్ సింగ్. కానీ టీజర్ లో రకుల్ కనిపించలేదు. ట్రయిలర్ కోసం రకుల్ ను దాచేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో నాగ్ తరువాత రకుల్ దే కీలకపాత్రగా తెలుస్తోంది. 2006 లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా 'ఐ డూ' ఆధారంగా మన్మధుడు 2 తయారవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలే వాస్తవమైతే, ఐ డూ సినిమాలో అద్దె భార్య పాత్ర ఒకటి వుంటుంది. అదే రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్లు అనుకోవాలి. ఐ డూ సినిమా పక్కా తెలుగు కథ మాదిరిగానే వుంటుంది. పక్కాగా నాగ్ కు సూట్ కావడమే కాకుండా, ఫ్యామిలీ వాతావరణం, ఫన్ ఫుల్ గా వుంటుంది. కాకపోతే, ఇలాంటి లైన్ లు తెలుగులో గతంలో వచ్చాయి.

టీజర్ విషయంలో కమర్షియల్ గా రాహుల్ రవీంద్రన్ ఫుల్ మార్కులు కొట్టేసాడు. అయితే సబ్జెక్ట్ పాతదానిగా అనిపించకుండా, కొత్తగా రాసుకుని, ఫన్ జనరేట్ చేస్తే నాగ్ కు మళ్లీ మంచి హిట్ దక్కుతుంది.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?