ధని ఒరువన్ రీమేక్ పనులు హుషారుగా సాగుతున్నాయి. ఇక త్వరలో సెట్ మీదకు వెళ్లే ఈ సినిమాకు ధృవ అని వర్కింగ్ టైటిల్ పెట్టే ఆలోచనలో వున్నట్లు వినికిడి. ఈ టైటిల్ పరుచూరి గోపాల కృష్ణ సూచించారని మెగాస్టార్ కు తెలుస్తోంది. ఇదిలా వుంటే సుకుమార్-చెర్రీ సినిమాకు సంబంధించి లైన్ డిస్కషన్లు పూర్తి చేసినట్లు వినికిడి.
చరణ్ టెంటటివ్ గా లైన్, ప్రాజెక్టు ఓకె చేయడంతో, తన డైరక్టర్ సినిమా వర్క్ తో పాటు, ఈ సినిమా వర్క్ ను కూడా స్టార్ట్ చేయడం ప్రారంభించేసారట. అయితే సుకుమార్ కు చెర్రీ నుంచి ఒక్కటే సూచన అందిందట..ఎటువంటి మెలికలు, కామన్ ఆడియన్ కు అందని నెరేషన్ కాకుండా, మంచి కాంటెంపరరీ లవ్ స్టోరీ చేయాలన్నది మాత్రమేనట.
అంటే రామ్ చరణ్ కు తన ఆడియన్స్ కు డైరక్ట్ రీచ్ అయ్యే సబ్జెక్ట్ ను మాత్రమే చేయాలని, ఆరెంజ్ లాంటి ప్రయోగాలు ఇక చేయకూడదని డిసైడ్ అయ్యాడని అర్థమైపోతోంది.