రామ్‌ చరణ్‌ లవ్‌స్టోరీ?

‘గోవిందుడు అందరివాడేలే’తో ఫ్యామిలీ జోనర్‌ ట్రై చేసిన రామ్‌ చరణ్‌ తన తదుపరి చిత్రం కూడా తన మాస్‌ ఇమేజ్‌కి భిన్నంగా ఉండేట్టు చూసుకుంటున్నాడు. ఈసారి పూర్తి స్థాయి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని చరణ్‌…

‘గోవిందుడు అందరివాడేలే’తో ఫ్యామిలీ జోనర్‌ ట్రై చేసిన రామ్‌ చరణ్‌ తన తదుపరి చిత్రం కూడా తన మాస్‌ ఇమేజ్‌కి భిన్నంగా ఉండేట్టు చూసుకుంటున్నాడు. ఈసారి పూర్తి స్థాయి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలని చరణ్‌ ఫిక్సయ్యాడు. ఇంతవరకు తన కెరీర్లో ‘ఆరెంజ్‌’ మినహా చరణ్‌ లవ్‌స్టోరీస్‌ ఏమీ చేయలేదు. తనతో ఇంటరాక్ట్‌ అయిన ఫాన్స్‌ కూడా లవ్‌స్టోరీస్‌ ఎటెంప్ట్‌ చేయమని కోరడంతో చరణ్‌ ఆ దిశగా వెళుతున్నాడు.

చరణ్‌ తదుపరి చిత్రం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే శ్రీను వైట్ల చెప్పిన కథ చరణ్‌కి నచ్చకపోవడంతో వేరే దర్శకులతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్‌ విజయ్‌ కుమార్‌ కొండా చరణ్‌కి ఒక లైన్‌ చెప్పినట్టు.. చరణ్‌కి లైన్‌ నచ్చిందని, డెవలప్‌ చేయమని చెప్పాడని సమాచారం. 

‘ఒక లైలా కోసం’తో రెండోసారి అదృష్టం పరీక్షించుకుంటోన్న విజయ్‌ కుమార్‌ కొండా కనుక ఈ చిత్రంతోను ఇంప్రెస్‌ చేసినట్టయితే చరణ్‌తో సినిమా ఓకే కావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇదిలావుంటే కోన వెంకట్‌, గోపీమోహన్‌ చెప్పిన కథని ఓకే చేసిన చరణ్‌ దానిని ఎవరి డైరెక్షన్‌లో చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఇటీవలే దర్శకుడిగా పరిచయమైన ఒక యువ దర్శకుడి పేరు పరిశీలనలో ఉన్నట్టు టాక్‌ వినిపిస్తోంది.