‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’తో వరుసగా రెండు హిట్స్ సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే ‘కరెంట్ తీగ’తో మన ముందుకి వస్తోంది. ఈ శుక్రవారమే విడుదల కావాల్సిన ఈ చిత్రం వైజాగ్‌లో తుఫాన్ సృష్టించిన విలయంతో వాయిదా పడిరది. ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు కానీ అక్టోబర్ 24న విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలిసింది.
కరెంట్ తీగలో రకుల్ ప్రీత్ సింగ్ స్కూల్ పిల్ల క్యారెక్టర్ చేసిందట. తన వయసు కంటే తక్కువ ఏజ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని, ఇందులో పల్లెటూరి అమ్మాయిగా.. జగపతిబాబు కూతురిగా కనిపిస్తానని చెప్పింది. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని… తప్పకుండా హ్యాట్రిక్ హిట్ అవుతుందనే హోప్ ఉందని అంది.
Watch Interview With Rakul Preet Singh
హిందీలో ఒక చిత్రంలో నటిస్తోన్న రకుల్ తెలుగులో మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది. తన పారితోషికం పెరిగిందా అనే ప్రశ్నకి డిమాండ్‌ని బట్టి రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని, ఆర్థిక వ్యవహారాలు తన మేనేజర్ చూసుకుంటాడని నవ్వేసింది.