తన బలమేంటో బాగా కనిపెట్టిన రామ్ చరణ్ ఇంతకాలం దానిని నమ్ముకుని వరుసగా మాస్ సినిమాలు చేసాడు. లక్కీగా ఆ చిత్రాలు విజయవంతమై చరణ్‌కి మాస్ హీరోగా గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు రూటు మార్చాలని చూస్తున్నాడు. తన బలహీనతలపై చరణ్ దృష్టి పెడుతున్నాడు.
చరణ్‌కి లోకల్‌గా మార్కెట్ బ్రహ్మాండంగా ఉన్నా కానీ ఓవర్సీస్లో మాత్రం ఫెయిలవుతున్నాడు. అందుకే ఈసారి ఆ మార్కెట్‌ని కొల్లగొట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ మిషన్‌లో భాగంగా అతను చేస్తోన్న తొలి చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. అక్కడ కామెడీ చిత్రాలు, కుటుంబ విలువలు ఉన్న సినిమాలు బాగా ఆడతాయి కనుక గోవిందుడు చరణ్‌కి ఓవర్సీస్లో మంచి హిట్టిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రంతో మిలియన్ డాలర్ల క్లబ్లో చరణ్‌కి చోటు దక్కుతుందని అంచనా. నెక్స్ట్ సినిమాకి ఎలాగో శ్రీను వైట్ల ఫ్యాక్టర్ చరణ్‌కి హెల్ప్ అవుతుంది కనుక అతను తన లక్ష్యం దిశగా సాగిపోతున్నట్టే అనిపిస్తోంది.