మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. కథ వెతుక్కునే పనిలో బిజీగా వున్న చిరంజీవి, ఈ నెల 22న పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రాజెక్ట్ వివరాల్ని వెల్లడిరచే అవకాశం వుంది. ప్రతియేటా తన పుట్టిరోజుకి చిరంజీవి తన స్టిల్స్‌ని మీడియాకి విడుదల చేస్తుంటారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్ళాక.. ఆ ట్రెండ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి. అయితే మళ్ళీ సినిమాల్లో కొనసాగాలని డిసైడ్ అయిన చిరంజీవి, తన పుట్టినరోజు కోసం స్టయిలిష్ స్టిల్స్ విడుదల చేశారు.
ఇంకేముంది.. తమ అభిమాన హీరో మళ్ళీ గ్లామరస్ లుక్‌లో కన్పించడంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వినాయక్ డైరెక్షన్‌లో చిరంజీవి కొత్త సినిమా వుండబోతోందని ఇప్పటికే దాదాపు కన్‌ఫర్మ్ అయ్యింది. తన తండ్రి సినిమాకి తానే నిర్మాతనని చరణ్ కూడా ప్రకటించేసుకున్నాడు. ఆ సినిమాలో చరణ్ కూడా కాస్సేపు కన్పించనున్నాడట. మరోపక్క పవన్‌కళ్యాణ్, నాగబాబు కూడా చిరంజీవి కొత్త సినిమాలో నటించే అవకాశముందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
సినిమా కబుర్లపై క్లారిటీ ఈ నెల 22న రానుంది. ఈలోగా ‘మెగా’ లుక్ గురించిన చర్చే చాలా ఘాటుగా జరుగుతోంది సినీ వర్గాల్లో. చిరంజీవిలో మునుపటి గ్లామర్ కన్పిస్తోందని కొందరు, రాజకీయాల్లోకి వెళ్ళాక గ్లామర్ పోయిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. లుక్‌దేముంది.. కెమెరా ముందుకొస్తే ఆటోమేటిగ్గా గ్లామరస్ లుక్ వచ్చేస్తుంది.. డాన్సుల సంగతేమిటి.? అన్నదే అసలు సిసలు ప్రశ్న. చిరంజీవి అంటేనే డాన్సులు.. కానీ పెరిగిన హోదా.. దాంతోపాటుగా వయసు.. వీటిని పక్కన పెట్టి, చిరంజీవి తనదైన డాన్సులతో అలరిస్తారా.? వేచి చూడాల్సిందే.