రామ్ చరణ్ తో మేర్లపాక

బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు కొట్టేసాడు మేర్లపాక గాంధీ. తమ బ్యానర్ లో సినిమా చేసిన వాళ్లని యువి వాళ్లు అంత సులువుగా వదులుకోరు. అందుకే రాధాకృష్ణ, సుజిత్ ల మాదిరిగా…

బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు కొట్టేసాడు మేర్లపాక గాంధీ. తమ బ్యానర్ లో సినిమా చేసిన వాళ్లని యువి వాళ్లు అంత సులువుగా వదులుకోరు. అందుకే రాధాకృష్ణ, సుజిత్ ల మాదిరిగా మేర్లపాక గాంధీ కూడా అక్కడే వుండిపోయారు. ఇప్పుడు వినిపిస్తున్న సంగతి ఏమిటంటే, మేర్లపాక మురళి ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తయారుచేయడంలో వీర బిజీగా వున్నారని. ఆ స్క్రిప్ట్ మరెవరి కోసమో కాదు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కోసం అని వినికిడి. 

యువి క్రియేషన్స్ ఎప్పటి నుంచో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. సుకుమార్ సినిమా పూర్తయ్యాక చేయడానికి వీలుగా గాంధీ ఈ స్క్రిప్ట్ తయారుచేస్తున్నారట. గాంధీ గత సినిమాల తరహాలో అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మోడ్ లోనే ఈ స్క్రిప్ట్ కూడా వుంటుందని వినికిడి. 

అయితే ఈ స్క్రిప్ట్ సినిమాగా మారడానికి మాత్రం కనీసం ఓ ఏడాది పట్టేలాగే వుంది. ఎందుకంటే సుకుమార్ సినిమా ముందు వుందిగా..అది అంత సులువుగా పూర్తవుతుందా?