రాముడ్ని వదిలేయండి ఎన్టీఆర్‌జీ

ఎన్టీఆర్‌కి ‘రభస’తో మరోసారి చుక్కెదురైంది. నిజానికి ఈ చిత్ర కథని సంతోష్‌ శ్రీనివాస్‌ ఇతడిని దృష్టిలో పెట్టుకుని రాసుకోలేదు. కందిరీగ తరహాలోనే ఉంటుంది కనుక దీనికి ‘కందిరీగ 2’ అని పేరు పెట్టుకుని రామ్‌తోనే…

ఎన్టీఆర్‌కి ‘రభస’తో మరోసారి చుక్కెదురైంది. నిజానికి ఈ చిత్ర కథని సంతోష్‌ శ్రీనివాస్‌ ఇతడిని దృష్టిలో పెట్టుకుని రాసుకోలేదు. కందిరీగ తరహాలోనే ఉంటుంది కనుక దీనికి ‘కందిరీగ 2’ అని పేరు పెట్టుకుని రామ్‌తోనే చేద్దామని అనుకున్నాడు. సినిమా అనౌన్స్‌ అయిన తర్వాత హీరోని మార్చేసారు. 

ఎప్పుడో సంతోష్‌ని కలిసిన ఎన్టీఆర్‌ కథ విని బాగుందనడంతో బెల్లంకొండ సురేష్‌ అప్పటికప్పుడు ఎన్టీఆర్‌ని హీరోగా ఫిక్స్‌ చేసేసాడు. ఎన్టీఆర్‌ కోసమని కొన్ని ఫైట్లు జోడిరచి అదే కథలో చిన్న చిన్న మార్పులు చేసారు. అయితే ఎన్టీఆర్‌ స్థాయి మాస్‌ హీరో చేయాల్సిన చిత్రం కాదని రభస చూసిన అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. 

ఇంతకుముందు కూడా రామ్‌ కోసం సురేందర్‌రెడ్డి తయారు చేసుకున్న ఊసరవెల్లి కథని ఎన్టీఆర్‌ చేసేసాడు. ఆ సినిమా బాగున్నా కానీ ఎన్టీఆర్‌ రేంజ్‌కి సరితూగలేదు. యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుని దూకుడు హవాలో కొట్టుకుపోయింది. ఇకనైనా ఎక్స్‌క్లూజివ్‌గా తన కోసం రాసుకున్న కథల్ని, లేదా తన స్థాయి హీరోల కోసం రాసుకున్న కథల్ని ఎన్టీఆర్‌ ఎంచుకుంటే మంచిది. లేదంటే ఇలాంటి రిజల్ట్‌లు మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతాయి.