మళ్లీ కర్చీఫ్ వేశాడు.. ఈసారి ఏమౌతుందో!

హిట్ కొట్టిన దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ లిస్ట్ లో అందరికంటే ముందు నితిన్ ఉంటాడనుకోండి. అది వేరే విషయం. ఇలాంటి వాటిలో రామ్…

హిట్ కొట్టిన దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఈ లిస్ట్ లో అందరికంటే ముందు నితిన్ ఉంటాడనుకోండి. అది వేరే విషయం. ఇలాంటి వాటిలో రామ్ కూడా కాస్త ముందుంటాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టులు మాత్రం పట్టాలపైకి రావు. తాజాగా ఆర్ఎక్స్100 దర్శకుడిని కూడా లాక్ చేశాడు రామ్.

ఆర్ఎక్స్100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి, తన నెక్ట్స్ సినిమాను రామ్ తో ప్లాన్ చేశాడు. ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ, ఫైనల్ గా రామ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు భూపతి. అంతా బాగానే ఉంది కానీ భూపతితో ప్రాజెక్టును రామ్ ఫైనలైజ్ చేస్తాడా అనేది అందర్లో డౌట్. ఎందుకంటే, గతంలో ప్రవీణ్ సత్తారు విషయంలో కూడా ఇలానే జరిగింది.

గరుడవేగ సక్సెస్ తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు ప్రవీణ్ సత్తారు. అప్పట్లో తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ రామ్ తో సినిమాకు సై అన్నాడు. తీరా ప్రవీణ్ సత్తారు చెప్పిన లైన్ రామ్ కు నచ్చలేదు, ఆ బడ్జెట్ స్రవంతి రవికిషోర్ కు నచ్చలేదు. దీంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రవీణ్ సత్తారు వేరే ప్రాజెక్టు చూసుకున్నాడు. అలా రామ్ కారణంగా గరుడవేగ సక్సెస్ ను వెంటనే క్యాష్ చేసుకోలేకపోయాడు ప్రవీణ్ సత్తారు.

ఇప్పుడు అజయ్ భూపతి వంతు వచ్చింది. ఆర్ఎక్స్100 సక్సెస్ తో ఊపుమీదున్న ఈ దర్శకుడు రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆర్ఎక్స్100 సినిమా జనాల్లో నానుతున్నప్పుడే మరో సినిమా చేయాలనేది ఈ దర్శకుడి ఆశ. మరి రామ్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి. తన స్టోరీలైన్ తో రామ్ ను అజయ్ భూపతి ఒప్పించగలడా..? లేక ప్రవీణ్ సత్తారులా సైడ్ అయిపోతాడా..? వెయిట్ అండ్ సీ.