రామచంద్రాపురం కోటలో బాలయ్య

బాలయ్య తాజా సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీని కోసం రామచంద్రాపురం కోటను ముస్తాబు చేస్తున్నారు. ఈ భవంతిలో వందలాది తెలుగు సినిమాల షూటింగ్ జరిగింది. దీని రెప్లికాను రామానాయుడు తన స్టూడియోలో…

బాలయ్య తాజా సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీని కోసం రామచంద్రాపురం కోటను ముస్తాబు చేస్తున్నారు. ఈ భవంతిలో వందలాది తెలుగు సినిమాల షూటింగ్ జరిగింది. దీని రెప్లికాను రామానాయుడు తన స్టూడియోలో నిర్మించారు. 

అయినా బాలయ్యకు కొన్ని షూటింగ్ స్పాట్ లు సెంటిమెంట్ గా మారాయి. వాటిలో రామచంద్రాపురం భవంతి కూడా ఒకటి. అందుకే దీన్ని కూడా ముస్తాబు చేస్తున్నారు. ఇందులో కొన్ని రోజులు షూటింగ్ కు ప్లాన్ చేసారు. శ్రీవాస్ దర్శకత్వం వహించే ఈ సినిమా బాలయ్యకు 99 వ చిత్రం.