కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో హౌజ్ ఫుల్-4 సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమాలో నానా పటేకర్ స్థానంలో రానాను తీసుకున్న విషయం తెలిసిందే. అలా ఊహించని విధంగా ఈ సినిమాలోకి ఎంటరైన రానా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చేశాడు. ముంబయిలో హౌజ్ ఫుల్-4 షూట్ మళ్లీ మొదలైంది.
హౌజ్ ఫుల్-4 షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. ఇప్పుడీ మూవీ నుంచి నానా పటేకర్ నటించిన సన్నివేశాలన్నీ తొలిగించారు. ఆ సీన్స్ అన్నింటినీ మరోసారి ఫ్రెష్ గా రానాతో పిక్చరైజ్ చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని మళ్లీ రీషూట్ చేస్తున్నట్టే లెక్క. అన్ని కాంబినేషన్ సీన్లు ఉన్నాయి మరి.
ఇక ఈ సినిమా నుంచి దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇతడిపై ఒకరిద్దరు కాదు, ఏకంగా నలుగురు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో సాజిద్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఫర్హాద్ సమ్జీ మెగాఫోన్ అందుకున్నాడు.
తాజా మార్పులతో హౌజ్ ఫుల్-4 బడ్జెట్ రెట్టింపు అయింది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు హీరో అక్షయ్ కుమార్ తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కృతి కర్బందా, కృతి సనోన్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.
చిలక.. 'ఛీ'బీఐ.. భళా మోడీ భళా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ లో