Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వారసులకు ఇక సమస్యేనా?

వారసులకు ఇక సమస్యేనా?

మ్యాన్యు ఫాక్చర్డ్ హీరోలు, డైరక్టర్లు వేరు. బార్న్ హీరోలు, డైరక్టర్లు వేరు. ఇన్నాళ్లు టాలీవుడ్ లోని కొందరు పెద్ద తలకాయలది ఒకటే ఆలోచన. తమ డబ్బులు, లేదా తమ పలుకుబడి వాడి, రుద్దగా రుద్దగా ఎప్పుడో ఒకప్పుడు ఓ హిట్ కొట్టికపోతారా? హీరోలుగా సెటిల్ అయిపోకపోతారా? అన్నదే ఆ ఆలోచన. నిన్న మొన్నటి దాకా ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యిందేమో కానీ ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయింది.

సామాజిక మాధ్యమాలు చలనవంతం అయ్యాక, కుర్రకారు సైతం ప్రపంచ సినిమాకు దగ్గరయ్యాక, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లో ప్రతి ఇంటికి చేరుపోతున్నాక, రొటీన్ సినిమాలను, ఆ మాత్రం, ఈ మాత్రం సినిమాలను జనం నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతున్నారు. ఇలా పక్కనపెట్టే వాళ్లో అభిమానులు కూడా వుంటున్నారు. హీరో ఎవరు అన్నది చూడడంలేదు. సినిమా బాగుందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అయినా డోంట్ కేర్, విజయ్ దేవరకొండ నొటా అయినా బేఖాతర్. సినిమా బాగుంటునేం. హీరో అభిమానం ఆ తరువాతే. అభిమానులు కూడా సినిమాను పదే పదే చూసి కలెక్షన్లు పెంచాలనుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఫేక్ కలెక్షన్లు సర్క్యులేట్ చేసి సంతృప్తి పడుతున్నారు.

దీనివల్ల మ్యాన్యుఫాక్చర్డ్ అనిపించుకునేవారు లేదా, స్టామినా లేని వారు పక్కకు వెళ్లిపోతున్నారు. స్టామినా వున్నా కూడా అన్నిరకాల పాత్రలు చేసే ఆది పినిశెట్టి లాంటివాళ్లు, నిలదొక్కుకోగలుగుతున్నారు. వాళ్లు కూడా రొటీన్ అంటే, సైడ్ ప్లీజ్ అంటున్నారు.

సందీప్ కిషన్, సుశాంత్, రాజ్ తరుణ్, సుధీర్ కుమార్, నారా రోహిత్, అల్లు శిరీష్, మంచు విష్ణు, మనోజ్... ఇప్పటికే దాదాపు తగ్గిపోయారు. నాగచైతన్య, అఖిల్, నాగశౌర్య, సాయిధరమ్ తేజల భవిష్యత్ ఇమ్మీడియట్ గా రాబోయే సినిమాల మీద ఆధారపడి వుంది. నిఖిల్ కూడా జాగ్రత్త పడాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి.

నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ మాత్రమే ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కాస్త భరోసా వున్న హీరోలు. రానా డిఫరెంట్ పాత్ లో వున్నాడు కాబట్టి అతని వ్యవహారం వేరు. రవితేజకు కూడా ఫస్ట్ డేంజర్ సిగ్నల్ అప్పుడే మోగేసింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లు ఈ ఐటమ్ రేంజ్ లోకి రారు. సీనియర్ హీరోలు నాగ్, వెంకీ కూడా సరైన సినిమాలు చేయకుంటే ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన రోజులు వచ్చేసాయి.

మొత్తంమీద ఇకపై సినిమా ప్రేక్షకులపై రుద్దుడు కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడిపోతున్నట్లే. ఎందుకంటే సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ఆదరణ తగ్గిపోతోంది. అందువల్ల ఇక మొహమాటపు చాన్స్ లు, నిర్మాణాలు వుండవు.

2019లో చాలామంది తెరమరుగు అయిపోయే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.

ఆత్మ గౌరవమా తోటకూర కట్టా.. కాంగ్రెస్ తరపున కొత్త దళారీ చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?