జెనీలియా.. రానా… నా ఇష్టం.., నయనతార.. రానా.. కృష్ణం వందే జగద్గురమ్.. వెంకీ బాబాయ్ తో జోడీ కట్టిన అమ్మాయితో జోడీ కడితే సినిమా ఫట్ అని సెంటిమెంట్ రెడీ చేసాయి ఈ రెండు సినిమాలు. భళ్లాల దేవను కాదని అమరేంద్ర బాహుబలితో జోడి కటకట్టింది దేవసేన.. అనుష్క.. అంతే.. బాహుబలి హిట్.
Advertisement
మరి ఇప్పుడు అనుష్కతో రానా జోడీ కట్టాడు రుద్రమదేవిలో. ఇప్పటికే బాబాయ్ వెంకీతో చింతకాయల రవి అంటూ ఓ ఫ్లాప్ ఇచ్చింది అనుష్క. మరి ఇప్పుడు రుద్రమదేవిలో రానా-అనుష్క ఈక్వేషన్ ఎలా వుండబోతోందో అన్నది పజిల్. ముడివిడడానికి ఇంకో రోజు వుంది. సెంటిమెంట్ దాటేస్తే, బాబాయ్ హీరోయిన్లు ఎవరైనా మిగిలిపోతే, జోడీ కట్టేయచ్చు రానా.