కొంతకాలం క్రితం రామ్ గోపాల్ వర్మ తన స్టయిల్ లో ప్రకటించే తామర తంపర ప్రాజెక్టుల్లో ఒకటి సావిత్రి. మీసాలు కూడా మొలవని కుర్రాడు, తన కన్నా వయసులో ఎంత పెద్దయిన అమ్మాయిని కాంక్షతో చూసే ఫస్ట్ లుక్ లు చూసి జనం గగ్గోలు పెట్టారు. దాంతో పేరును సావిత్రి అని కాకుండా శ్రీదేవి అని మార్చారు. దాంతో ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రీదేవి భర్త బోనీ కపూర్ బుస్సుమన్నారు. కోర్టుకు కూడా వెళ్లారంటూ వార్తలు వినవచ్చాయి. ఆ తరువాత ఆ ప్రాజెక్టు ఏమయిందో, అతీ గతీ లేదు.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న సంగతి ఏమిటంటే, ఈ ప్రాజెక్టు అలా అలా సైలెంట్ గా రెడీ అయిపోవచ్చిందట. దీనికి రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో ఒకడైన జెడి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహారిస్తున్నాడట. ఈ సినిమా కాస్త సెన్సేషన్ గానే వుంటుందని వినికిడి. రామ్ గోపాల్ వర్మ హింస అయినా సెక్స్ అయినా విజువల్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. చూపించేది తక్కువైనా ఇంపాక్ట్ ఎక్కువగా వుండేలా చూస్తాడు.
ఇటీవల ఐస్ క్రీమ్ లో కేవలం పాదాల దగ్గర నుంచి అండర్ వేర్ తీసే సీన్ తోనే కాకపుట్టించాడు. ఇప్పుడు ఇలాంటి సీన్లు శ్రీదేవిలో మరిన్ని వున్నట్లు తెలుస్తోంది. అసలు వినిపిస్తున్న గుసగుసల ప్రకారం, రామ్ గోపాల్ వర్మ మాంచి అడల్ట్ పిక్చర్ తీసి చూపాలనే ఈ ప్రాజెక్టు ప్రారంభించాడట. అయితే ఆయనకు దగ్గరగా వుండే జనాలు, వద్దని వారించారట. దాంతో ఆ సీన్లన్నీ స్క్రిప్ట్ నుంచి అవాయిడ్ చేసారట.