అమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రణబీర్ పెళ్లి అనగానే ఆ హీరోయిన్ ఎవరని అడుగుతారు ఎవరైనా. కానీ రణబీర్ పెళ్లిచేసుకోబోయేది హీరోయిన్ ను కాదు. అవును.. ఇంట్లో చూసిన సంబంధమే చేసుకోబోతున్నాడు ఈ 34 ఏళ్ల కపూర్ హీరో.
గత వారమే తల్లి నీతూ కపూర్ తో కలిసి లండన్ వెళ్లాడు రణబీర్ కపూర్. పేరుకు అది సమ్మర్ వెకేషన్ అయినప్పటికీ… అక్కడే రణబీర్ కు పెళ్లిచూపులు అయిపోయాయట. ఈ కుటుంబానికి బాగా సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు రణబీర్ కోసం అక్కడే 2-3 పెళ్లిచూపులు ఎరేంజ్ చేశారట. అలా చూసిన ఎన్నారై అమ్మాయిల్లోంచి ఒకమ్మాయిని సెలక్ట్ చేయడమే రణబీర్ పని.
రణబీర్-కత్రినా చాన్నాళ్లు ప్రేమించుకున్నారు. నిశ్చితార్థం కూడా అయిపోయింది పెళ్లి మాత్రమే బ్యాలెన్స్ అనుకున్నారంతా. కానీ వాళ్లిద్దరూ విడిపోయారు. కత్రినా కంటే ముందు మరో ఇద్దరు హీరోయిన్లతో రణబీర్ డేటింగ్ చేసినప్పటికీ ఆ రిలేషన్ షిప్ కూడా వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా ఇంట్లో చూసిన సంబంధమే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట రణబీర్.