రంగస్థలం ఈస్ట్ హక్కులు @ 6.03 కోట్లు

రంగస్థలం మార్కెటింగ్ వ్యవహారాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఈరోజు ఈస్ట్ గోదావరి డీల్ ఫైనల్ చేసారు. 6.03 కోట్లకు వి3 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తీసుకుంది. Advertisement బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ 150తో…

రంగస్థలం మార్కెటింగ్ వ్యవహారాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఈరోజు ఈస్ట్ గోదావరి డీల్ ఫైనల్ చేసారు. 6.03 కోట్లకు వి3 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తీసుకుంది.

బ్లాక్ బస్టర్ ఖైదీ నెంబర్ 150తో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ఆ సినిమాను అనుశ్రీ ఫిలింస్ 5.40 కోట్లకు కొనుగోలు చేసింది. ధృవ సినిమాను అమ్మలేదు. గీతా ద్వారా విడుదల చేసారు. అలాగే కాటమరాయుడు సినిమాను 5.85కు విక్రయించారు. దువ్వాడ జగన్నాధమ్ ను 5.40 కోట్లకు అమ్మారు.

ఒక్క అజ్ఞాతవాసిని పక్కన పెడితే మిగిలిన మెగా సినిమాలు అన్నింటికన్నా ఇదే ఎక్కువ రేటు అనుకోవాలి. రంగస్థలం సినిమా వాతావరణం ఎక్కువగా గోదావరి జిల్లాలదే కావడం, ఇక్కడే ఎక్కువగా షూట్ కావడం, పైగా సుకుమార్ ది ఈ ప్రాంతమే కావడం వంటి కారణాలతో ఈస్ట్ లో మంచి రేటే పలికింది.

ముఫైమూడు కోట్ల రేషియోలో ఆంధ్రకు పలికినట్లు అయింది. ఆ లెక్కన చూసుకుంటే చాలా మంచి రేటు వచ్చినట్లు లెక్క. ఇదే రేషియోలో వెస్ట్ గోదావరికి ఎల్ విఆర్ సంస్థ కొనుగోలు చేసింది.