సుకుమార్ డైరక్టర్. రామ్ చరణ్ హీరో. సమంత హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్. మైత్రీమూవీస్ నిర్మాణం. అలాంటి సినిమాకు బిజినెస్ సమస్యలు వుంటాయా? అంతా అబద్దం అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అదే వాస్తవం అంటున్నాయి ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు.
రంగస్థలం నైజాం ఏరియాకు అటు దిల్ రాజు, ఇటు ఆశియన్ సునీల్ కాకుండా వేరే కొత్త పార్టీకి భారీ రేటుకు అమ్మారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ కమిట్ మెంట్ అయిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు మళ్లీ ముందు వెనుకలు ఆడుతున్నారని తెలుస్తోంది.
ఆంధ్ర పరిస్థితి మరీ ఘోరంగా వుందని తెలుస్తోంది. 34 కోట్ల రేంజ్ లో ఆంధ్రకు అమ్మాలన్నది నిర్మాతల ప్రయత్నం. కానీ ఇప్పటికి ఆంధ్రకు వచ్చిన హయ్యస్ట్ ఆఫర్ 24 కోట్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీడెడ్ కూడా మాట మాత్రమే జరిగిందని ఇంకా రేట్ ఫిక్స్ కాలేదని టాక్ వినిపిస్తున్నాయి.
బిజినెస్ విషయంలో మరింత బజ్ తీసుకురావడం కోసమే రంగస్థలం యూనిట్ కిందా మీదా అవుతోంది. ఇప్పుటికి రెండు పాటలు విడుదల చేసింది. అందులో మొదటి దానికి లిటరరీ అప్లాజ్ వచ్చింది. కానీ సమంత డీ గ్లామర్ వైనంపై డవుట్ లు వున్నాయి.
రెండవది పాట ప్రారంభంలో బీట్ బాగానే వుంది కానీ, ఆ వేదాంతం జనాలకు ఏమేరకు పడుతుందో చూడాలి. ఇప్పటి దాకా ఒక్క డ్యూయట్ బయటకు రాలేదు. సినిమా మొత్తంమీద వున్నది ఒకటే డ్యూయట్ అని తెలుస్తోంది. సుకుమార్ ఇంతకు ముందు ఓ సినిమా డిజాస్టర్. మరో సినిమా నిర్మాత అలా అలా గట్టెక్కారు. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.