ఆ నిర్మాతకు నాని సినిమా చేయరా?

డైరక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ తో హీరో నానికి ప్రత్యేకమైన అనుబంధం వుంది. అవసరాల డైరక్షన్ లో ఓ సినిమా కమిట్ అయి వున్నాడు నాని. ఆ విషయం నానినే గతంలో ఒకటి…

డైరక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ తో హీరో నానికి ప్రత్యేకమైన అనుబంధం వుంది. అవసరాల డైరక్షన్ లో ఓ సినిమా కమిట్ అయి వున్నాడు నాని. ఆ విషయం నానినే గతంలో ఒకటి రెండుసార్లు వెల్లడించారు. కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే నాని మాత్రం చకచకా సినిమాలు చేస్తున్నారు. చేయబోయే సినిమాల జాబితా కూడా వుంది. 

కానీ ఎక్కడా అవసరాల పేరు వినిపించడం లేదు. దీనికి వేరే కారణం వుందని తెలుస్తోంది. అవసరాలను డైరక్టర్ గా పరిచయం చేసింది, రెండు సినిమాలు చేసింది నిర్మాత సాయి కొర్రపాటినే. అదే బ్యానర్ లో శ్రీనివాస్ అవసరాల ఓ సినిమా చేయాల్సిన కమిట్ మెంట్ వుంది. నానితో చేయబోయే సినిమాను సాయి కొర్రపాటికి చేయాలన్నది అవసరాల అభిమతం అని తెలుస్తోంది.

కానీ నానికి మాత్రం ఆ బ్యానర్ కు చేసే ఉద్దేశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది డైరక్ట్ గా చెప్పలేక, చెప్పీ చెప్పనట్లు చెప్పి, శ్రీనివాస్ అవసరాలను అలా వెయిటింగ్ లో వుంచినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి నానికి మంచి పాత్ర వున్న ఈగ సినిమా నిర్మాత సాయి కొర్రపాటినే. అంతేకాదు.. నాని అంటే ఎంత అభిమానం వున్న దర్శకుడు రాజమౌళికి సన్నిహితుడు కూడా సాయినే.

మరి అలాంటి సాయి కొర్రపాటికి సినిమా చేయడం విషయంలో నాని అంత ఆసక్తిగా లేరని వార్తలు ఎందుకు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయో?