రేప్ సీన్ తో అలసట

సినిమా షూటింగ్ అంటే కాస్త అలసట వుంటుంది. అందులో అతి ఏమీ లేదు. అయితే షూట్ చేసినంత మాత్రాన మిగిలిన పనులేవీ ఆపేసుకోరు నటులు. కాస్త వీలు చూసుకుని అన్ని పనులు చక్కబెట్టుకుంటారు.  Advertisement…

సినిమా షూటింగ్ అంటే కాస్త అలసట వుంటుంది. అందులో అతి ఏమీ లేదు. అయితే షూట్ చేసినంత మాత్రాన మిగిలిన పనులేవీ ఆపేసుకోరు నటులు. కాస్త వీలు చూసుకుని అన్ని పనులు చక్కబెట్టుకుంటారు. 

కథలు వింటారు, కొత్త సినిమాలు ఓకె చేస్తారు. ఇంకా ఇంకా..అయితే తెలుగు వారికి పరిచయమైన తమిళ హీరోయిన్ వ్యవహారం వేరుగా వుంది. ఈ మధ్య ఆ హీరోయిన్ కు ఎవరో కథ చెప్పాలనుకున్నారు. 

మాంచి ఒడ్డు,పొడవు వున్న ఆ తమిళ హీరోయిన్ అంటే మన ప్రేక్షకులు కూడా కాస్త క్రేజీగా చూస్తారు. అందుకే ఆ అమ్మాయిని సినిమాలోకి తీసుకోవాలనుకున్నారు. ఆ మేరకు ముందు రోజు వేరే మధ్యవర్తి ద్వారా కబురు చేసారు.

దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని చిన్న షాక్ తిన్నారు. 'ఈరోజు రేప్ సీన్ చేసాను షూట్ లో, వళ్లంతా అలిసిపోయింది..రెండు రోజుల దాకా తేరుకోవడం కష్టం..ఆ తరువాత వింటా' అన్నది ఆ హీరోయిన్ .

విన్న మధ్యవర్తి, తెలుసుకున్న సినిమా జనాలు కూడా షాకై, రేప్ సీన్ చేస్తే, మరీ అంత అలసట ఏమిటో? రెండు రోజుల విశ్రాంతి ఏమిటో..విడ్డూరం కానీ అనుకున్నారట.