రెజీనాతో జతకట్టాలనుందన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే!

టాలీవుడ్ హీరోయిన్ రెజీనాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు  తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఆమెతో జత కట్టాలని ఉందని.. ఆమెతో జతగా ఒక సినిమా చేయాలని ఉందని కూడా ఎమ్మెల్యేగారు తన…

టాలీవుడ్ హీరోయిన్ రెజీనాపై తన అభిమానాన్ని చాటుకున్నాడు  తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఆమెతో జత కట్టాలని ఉందని.. ఆమెతో జతగా ఒక సినిమా చేయాలని ఉందని కూడా ఎమ్మెల్యేగారు తన కోరికను బయటపెట్టడం విశేషం… రసమయి వ్యక్తపరిచిన ఈ సరదాకు వేదిక అయ్యింది 'శౌర్య' సినిమా ఆడియో విడుదల వేడుక. మంచుమనోజ్ హీరోగా, రెజీనా హీరోయిన్ గా నటించిన ఆసినిమా ఆడియో విడుదల వేడుకకు హాజరైన రసమయి.. ఈ కోరికను వ్యక్తపరిచాడు. 

ఆ సినిమా హీరోయిన్ గురించి తన సరదా కోరికను వ్యక్తం చేశాడు. స్వతహాగా కళాకారుడై రసమయి.. ఈ సినిమా కార్యక్రమాన్ని తన మాటలతో మరింత సరదాను తీసుకొచ్చాడు.అయితే రెజీనా తన కన్నా హైట్ అని.. ఆమెపక్కన నిలబడితే తను పొట్టిగా అనిపిస్తానని కూడా రసమయి అన్నాడు. ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన అందరినీ నవ్వించడాన్ని కొనసాగిస్తూ.. తమలాంటి పొట్టి వాళ్లను తక్కువగా అంచనా వేయొద్దని.. ఈ విషయంలో తనకు బ్రహ్మానందమే స్ఫూర్తి అని రసమయి అన్నాడు. 

షార్ట్ గానే ఉన్నా.. బ్రహ్మానందం టాలీవుడ్ లో ఏ స్థాయికి ఎదిగాడో గుర్తుంచుకోవాలని అన్నాడు. కాబట్టి పొట్టిగా ఉన్న తను రెజీనా తో కలిసి నటించాలని ఆశపడటం తప్పేమీ కాకపోవచ్చని ఈ ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు! మరి గత  ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి పాలిటిక్స్ లో సక్సెస్ అయిన రసమయి.. సినిమా కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశాడు. ఇది వరకూ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ఒక సినిమాలో నటించిన ఆయన రెజీనాతో జత కట్టాలని ఉందని చిత్రమైన కోరికను వ్యక్త పరిచాడు. ఆయన కోరికను విన్న ఆ హీరోయిన్ మాత్రం మిగతా వారిలాగానే ముసిముసినవ్వులతో స్పందించింది!