చరణ్ ఇమేజ్ ను వాడుకుంటున్న తమిళ హీరో..!

తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలను తెలుగులో మార్కెట్ చేసుకోవడానికి రకరకాల టెక్నిక్ లు అనుసరించడం రొటీనే. ఎవరైన ఒక హీరోకి సంబంధించిన డబ్బింగ్ బొమ్మ ఒకటి తెలుగులో బాగా ఆడిదంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని…

తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలను తెలుగులో మార్కెట్ చేసుకోవడానికి రకరకాల టెక్నిక్ లు అనుసరించడం రొటీనే. ఎవరైన ఒక హీరోకి సంబంధించిన డబ్బింగ్ బొమ్మ ఒకటి తెలుగులో బాగా ఆడిదంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని మరో అరడజను సినిమాలు డబ్ అయిపోతూ ఉంటాయి. అయితే జయంరవి విషయంలో కనీసం డబ్బింగ్ బొమ్మలు హిట్ అయిన దాఖలాలు లేకపోయినా.. ఎంచక్కా అతడి సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నాయి! ఉన్నట్టుండి ఆ తమిళ హీరో సినిమాలు తెలుగులోకి డబ్ కావడానికి కారణం మాత్రం రామ్ చరణే!

జయం రవి తమిళంలో నటించగా సూపర్ హిట్ అయిన 'తనీఒరువన్' ను చరణ్ రీమేక్ చేస్తుండటంతో… ఆ పేరు చెప్పి జయం రవి తమిళ సినిమాలను తెలుగులోకి డబ్ చేసేస్తున్నారు. వాటిని తెలుగులో విడుదల చేస్తూ.. చరణ్ పేరునే తెలివిగా ప్రచారంలోఉపయోగించుకొంటున్నారు నిర్మాతలు! తమిళంలో ఈ హీరో నటించిన సినిమాను త్వరలో తెలుగులో రామ్ చరణ్ రీమేక్ చేయనున్నాడు.. అలాంటి హీరో నటించిన సినిమా ఇది.. అంటూ ప్రచారం జరుగుతోంది జయం రవి సినిమా విషయంలో. చరణ్ కు మంచి కాన్సెప్టును అందించాడు కాబట్టి.. జయం రవి సినిమాలో విషయం ఉంటుందనేది వీరి వాదన!
 
మెగా పవర్ స్టార్ పేరును చెబుతూ.. ఈ సినిమా పట్ల జనాల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. మరి చరణ్ పేరుతో జయం రవి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకర్షించగలడో చూడాలి!