మా పరిశ్రమను ఎవరూ ఏమనొద్దు: రష్మీ

మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ఒకవైపు చిత్ర పరిశ్రమలోని అతివలే స్పందిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఈ అంశంపై స్పందించారు. వెటరన్ హీరోయిన్లు కూడా ఈ అంశాన్ని ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తప్పవని…

మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ఒకవైపు చిత్ర పరిశ్రమలోని అతివలే స్పందిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఈ అంశంపై స్పందించారు. వెటరన్ హీరోయిన్లు కూడా ఈ అంశాన్ని ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తప్పవని అన్నారు.

వాటికి తలొగ్గడం విషయంలో ఎవరికి వారు నిర్ణయించుకోవాలని కొందరు బోల్డ్ గా చెప్పేశారు. అయితే అతిగా తలొగ్గితే మాత్రం బతుకు తెల్లేరేది రెడ్ లైట్ ఏరియాలోనే అని వారు బాహాటంగా ప్రకటించారు కూడా. ఇక నేటి తరం హీరోయిన్లు కొందరు ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు.

తెలుగు, దక్షిణాది సినిమా పరిశ్రమల్లో కూడా ఇలాంటి తప్పవనేది కొందరి మాటలను గమనిస్తే స్పష్టం అవుతుంది. ఇలాంటి పరిణామాల మధ్యన ఈ రచ్చ సాగుతోంది. ఈ రచ్చపై ఇటీవలి పరిణామాలు మరింత ఆజ్యం పోశాయి. జనాలకు కూడా వీళ్ల వ్యవహారంపై బాగా చిరాకు వచ్చింది.

ఈ సినిమా వాళ్ల రచ్చకు టీవీ మీడియా కూడా అతిగా ప్రచారం కల్పించి.. జనాలపై వీళ్ల రచ్చను అతిగా రుద్దుతోందని మీడియా కూడా విమర్శల పాలయ్యింది. ఇక ఇదే సమయంలో ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి కూడా కౌంటర్ అటాక్ మొదలైనట్టుగా ఉంది. తమ చిత్ర పరిశ్రమను ఏమనొద్దు అని కొంతమంది స్పష్టం చేస్తున్నారు.

మహిళపై వేధింపులు ఉంటే ఉండవచ్చని.. అన్ని చోట్ల లాగానే అవి ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా ఏమీ లేవనే వాదనను హైలెట్ చేస్తున్నారు. ఈ జాబితాలోనే చేరింది జబర్దస్త్ రష్మీ. మహిళలపై వేధింపులు అన్నీ చోట్లా ఉన్నాయని, సినీ ఇండస్ట్రీనే ఈ విషయంలో చర్చగా మార్చవద్దని.. కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చను ఇక ఆపాలని ఆమె అంటోంది. మొత్తానికి సినీ పరిశ్రమలోని అతివల నుంచినే ఇలాంటి మాటలు వస్తుండటం గమనార్హం.