Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ర‌ష్మిక‌, రిష‌బ్.. ఫేస్ టు ఫేస్ తేల్చుకోవ‌చ్చుగా!

ర‌ష్మిక‌, రిష‌బ్.. ఫేస్ టు ఫేస్ తేల్చుకోవ‌చ్చుగా!

వీళ్లు హిట్స్ కొట్ట‌డం కాదు కానీ, వీళ్ల ర‌చ్చ మాత్రం మీడియాలో సీరియ‌ల్ లా సాగుతూ ఉంది. ర‌ష్మిక అలా అంది, రిష‌బ్ షెట్టి ఇలా కౌంట‌ర్ ఇచ్చాడు.. అంటూ వీళ్ల‌దో అంత‌ర్జాతీయ స్థాయి జ‌గ‌డం లా సాగుతూ ఉంది. ఏ ముహూర్తాన కాంతార సినిమా హిట్ట‌య్యిందో కానీ ఆ సంగ‌తి ప‌క్క‌న పెట్టి.. కిరిక్ పార్టీ అనే సినిమా, ఆ సినిమా హీరో ర‌క్షిత్ షెట్టితో ర‌ష్మిక ప్రేమాయ‌ణం, నిశ్చితార్థం త‌ర్వాత బ్రేక‌ప్, త‌ను కాంతార సినిమా చూడ‌లేదంటూ ర‌ష్మిక చెప్ప‌డం, దీనిపై క‌న్న‌డ నెటిజ‌న్లు తెగ ఇదైపోవ‌డం! ఇదంతా డైలీ సీరియ‌ల్ లా సాగుతూ ఉంది.

వాస్త‌వానికి ర‌ష్మిక తెలుగులో దూసుకుపోతున్న ద‌శ‌లోనే ర‌క్షిత్, రిష‌బ్ లు ఆ ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడారు. అయితే అప్ప‌ట్లో వీరి టోన్ ఇలా ఉండేది కాదు. నిశ్చితార్థం ర‌ద్దు చేసుకోవ‌డం వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం అని, అందులో ర‌ష్మిక‌ను త‌ప్పు ప‌ట్టేదేమీ లేద‌న్న‌ట్టుగా స్పంద‌న ఉండేది! నిజ‌మే.. సామాన్యుల్లోనే చాలా మంది ఎంగేజ్ మెంట్ల‌ను ర‌ద్దు చేసుకున్న దాఖ‌లాలు బోలెడ‌న్ని ఉంటాయి. 

అలాంటిది ఉన్న‌ట్టుండి ఫేమ్, డ‌బ్బు వ‌చ్చే స‌రికి ర‌ష్మిక కూడా త‌న డెసిషెన్ ను మార్చుకుని ఉండ‌వ‌చ్చు! అబ్బాయి త‌ర‌ఫు వాళ్లు తాము అనుకున్నంత ధ‌నికులు కాద‌ని ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకున్న అమ్మాయి త‌ర‌ఫు వాళ్లు, అమ్మాయి గురించి ఏవో రూమ‌ర్స్ విన్నామంటూ ఎంగేజ్ మెంట్ ను ర‌ద్దు చేసుకున్న అబ్బాయి త‌ర‌ఫు వాళ్లు ఏ ప‌ల్లెకు వెళ్లి చూసినా ఉంటారు! నిశ్చితార్థంతో ర‌ద్దైన వ్య‌వ‌హారాలు ఇండియాలోనే లక్ష‌ల్లోనో, కోట్ల‌లోనో ఉంటాయి!

జ‌నాలు వాటిని అంత లైట్ తీసుకుంటున్నా.. వీళ్లు హిట్స్ కొట్టి లైమ్ లైట్లో ఉంటున్న స‌రికి ప్ర‌తిసారీ ఇదో జ‌గ‌డం గా మారింది. ఈ మ‌ధ్య ఎప్పుడో ర‌ష్మిక ఏదో ఇంట‌ర్వ్యూలో త‌న తొలి సినిమా గురించి చెప్ప‌లేద‌ట‌! దీంతో క‌న్న‌డీగులు మ‌ళ్లీ రెచ్చిపోయారు! ఆమెకు కృత‌జ్ఞ‌త లేదంటూ విరుచుకుప‌డ్డారు. ఈ వెర్రి నెటిజ‌నుల‌కు ఇంత‌కు మించి ప‌నేం లేదేమో మ‌రి. ఇక రిష‌బ్ షెట్టి కూడా దీనిపై స్పందించేశాడ‌ట‌. త‌ను ప‌రిచ‌యం చేసేసిన న‌టీన‌టులు, నిర్మాత‌ల గురించి త‌ను మ‌ళ్లీ ప‌ట్టించుకునేది ఉండ‌ద‌ని, త‌న చూపు ఎప్పుడూ కొత్త వారిపైనే ఉంటుంద‌ని ర‌ష్మిక‌కు కౌంట‌ర్ ఇచ్చాడ‌ట‌. 

అయినా హిట్స్ ఇవ్వ‌డం కాదు కానీ, వీరి ఇగోల వ్య‌వ‌హారం మాత్రం నాన్సెక‌ల్ గా నానుతూ ఉంది. అటు రిష‌బ్ కు, ఇటు ర‌ష్మిక కూ ఇదేమీ మేలు చేసేది కాదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?