సోషల్ మీడియాలో నాలుగైదు ఏపీ పొలిటికల్ సెటైరిక్ వీడియోలు చూస్తే చాలు.. చంద్రబాబు వీడియోలు వెలుగు చూస్తాయి. వాటిల్లో ట్రోల్ వీడియోలే బాగా హైలెట్ అవుతున్నాయి. అందునా.. చంద్రబాబు నాయుడు జనం మధ్యకు వెళ్లి సైకిల్ పోవాలి, సైకిల్ వద్దు అంటూ నినదించే వీడియోలు వైరల్ గా కొనసాగుతూ ఉన్నాయి!
వయసు మీద పడటమో, కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్టుగా చంద్రబాబుకు ఆల్జీమర్సే ఉందో ఏమో కానీ.. తనేం మాట్లాడుతున్నది కూడా అర్థం చేసుకునే స్థితిలో చంద్రబాబు లేనట్టుగా ఉన్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు తను రిగ్గింగ్ చేసుకోవడానికి వెళితే అడ్డుకున్నారంటూ ఒక వీడియోలో చెప్పి వీరాభిమానులను కూడా నిశ్చేష్టులను చేశారు!
ఇంతకీ చంద్రబాబుకు ఏమైందని అభిమానులు కూడా హడలిపోయే పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంది. జనసమూహాన్ని ముందు పెట్టుకుని.. అంతా తనతో పాటు నినదించాలని పిలుపునిస్తూ సైకిల్ పాలన పోవాలి, సైకిల్ వద్దు, సైకిల్ పోవాలి.. అంటూ ఒకటికి పది సార్లు చెప్పడం పరాకష్ట!
గతంలో చినబాబు లోకేషుడు ఇలాంటి నినాదాలు ఇచ్చారు. పొరపాటును గానీ సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరి వేసుకున్నట్టే అంటూ లోకేష్ ఇచ్చిన నినాదం అలాంటిలాంటిది కాదు! ఇక కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అని చెప్పి.. ఔనా, కాదా అంటూ కార్యకర్తల చేత కూడా ఔననిపించారు లోకేష్. అలాంటి మరకలు చెరిగిపోయేవేమీ కాదు. అవే అనుకుంటే.. ఇప్పుడు చంద్రబాబూ అదే బాట పట్టారు.
ఒక రోజేమో తను రిగ్గింగ్ చేసుకోవడానికి వెళ్లానంటారు, రిగ్గింగ్ చేసుకోవడానికి వెళితే అడ్డుకున్నారంటారు. మరో రోజు సైకిల్ పోవాలంటారు, సైకిలొద్దంటారు. మరి ఇదే ఊపు చూస్తే.. ఎన్నికల నాటికి చంద్రబాబు, లోకేష్ ల నుంచి ఇలాంటి నినాదాలు ఇంకా ఎన్ని జాలువారతాయో!