Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాశికి పాతిక.. తమ్మూకి కోటింపాతిక

రాశికి పాతిక.. తమ్మూకి కోటింపాతిక

హిట్ వచ్చేవరకు థర్డ్ క్లాస్..హిట్ వస్తే ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఈ థర్డ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ కు ప్రమోట్ కావడానికి కిందామీదా పడుతోంది రాశీఖన్నా, ముద్దుగా బొద్దుగా వుండే ఈ అమ్మడుకు సినిమాలు బాగానే వస్తున్నాయి కానీ క్రేజ్ రావడంలేదు. అమెతో వచ్చిన రకుల్, రెజీనా దూసుకుపొతున్నారు. పారితోషికంలో కూడా కానీ పాపం, రాశీఖన్నా ఇంకా పాతికలక్షల రేంజ్ లోనే వుండిపొయింది.

ఇప్పుడు వచ్చే బెంగాల్ టైగర్ పైనే ఆశలు అన్నీ పెట్టుకుంది. ఈ సినిమాతో అయినా బ్రేక్ వస్తుందని ఆశిస్తోంది. కావడానికి సెకండ్ హీరోయిన్ అయినా, మంచి పాత్ర, కాస్త అందాల ఆరబొతలాంటివి అన్నీ అన్నీ వున్నాయట బెంగాల్ టైగర్ లో. అందుకే కాస్త పాత పారితోషికం అయినా ఓకె అని చేసిందట. 

ఇలాంటి మాస్ మసాలా సినిమా ఒకటి చేస్తే, బ్రేక్ వస్తుందని, అప్పుడూ తమన్నా మాదిరిగా కోటింపాతికపైనే డిమాండ్ చేసి తీసుకోవచ్చని. 10న విడుదలవుతున్న బెంగాల్ టైగర్ రాశీఖన్నా ఆశ తీర్చేలాగే వుంది. అన్నట్లు ఈ రోజు రాశీ ఖన్నా పుట్టినరోజు..ఆమె కోరిక తీరాలని విష్ చేద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?