రేటు కోసం చూస్తున్న దిల్ రాజు

నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో తయారైన ఇంద్రగంటి 'వి' సినిమాను అమెజాన్ సంస్థ తన ప్రయిమ్ కోసం అడుగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  మరి కొన్ని సినిమాలు కూడా రెడీగా వున్నాయి కానీ అవన్నీ…

నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో తయారైన ఇంద్రగంటి 'వి' సినిమాను అమెజాన్ సంస్థ తన ప్రయిమ్ కోసం అడుగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  మరి కొన్ని సినిమాలు కూడా రెడీగా వున్నాయి కానీ అవన్నీ ఇప్పటికే డిజిటల్ రైట్స్ ఇచ్చేసిన సినిమాలు. ఇవ్వకుండా మిగిలినవి నిశ్ళబ్దం, వి సినిమాలు మాత్రమే. పాతిక కోట్ల మేరకు ఆఫర్ ఇచ్చినా, దిల్ రాజు ముందు వెనుకలు ఆడుతున్నారని, థియేటర్లలో కాకుండా నేరుగా విడుదల చేస్తే, మాట పడతామని ఆలోచిస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి.

అయితే అసలు విషయం అది కాదని తెలుస్తోంది. మరికాస్త రేటుకోసం దిల్ రాజు వెయిట్ చేస్తున్నారని బోగట్టా. నలభై కోట్ల వరకు రేటు వస్తే ఇచ్చే ఆలోచనలో దిల్ రాజు వున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వి సినిమాకు కాస్త ఖర్చు ఎక్కువే అయింది. అంతా కలిపి ముఫై అయిదు నుంచి నలభై వరకు అయిందని బోగట్టా. అమెజాన్ ఆఫర్ ముఫై లోపుకే వచ్చింది. అయితే దిల్ రాజు నలభై కూడా అమెజాన్ మీదనే వచ్చేస్తే, హిందీ డబ్బింగ్ అన్నది లాభంగా వుండిపోతుంది. 

అదే సమయంలో అమెజాన్ టెర్మ్స్ బాగుండి శాటిలైట్ అమ్ముకోగలిగితే మరి కొంత వస్తుంది. ఫ్యూచర్ లో సి సెంటర్ ల్లో విడుదల చేసుకుంటే కొంత వస్తుంది. ఇదీ ఆలోచనగా తెలుస్తోంది. కానీ నలభై కోట్ల మేరకు అమెజాన్ ఇస్తుందా అన్నది అనుమానం. ఈ రేటు రాబట్టేదాకా దిల్ రాజు వైపు నుంచి ఏ విషయం పక్కాగా బక్షటడకు రాదు,. 

నిజానికి అమెజాన్ డైరక్ట్ గా డీల్ చేయడం లేదని, అటు ఇటు మధ్యవర్తులే డీల్ చేస్తున్నారని బోగట్టా. ఈ మధ్యవర్తులే నిశ్శబ్దం సినిమాకు కూడా 17 దగ్గర ప్రారంభించి 24 వరకు వెళ్లారని తెలుస్తోంది. అయితే వాళ్లు కూడా ముఫై వరకు రావాలని చూస్తున్నారు. 

ఇదిలా వుంటే నిశ్శబ్దం అయినా, వి అయినా, హీరో హీరోయిన్ లు, దర్శకులు, నిర్మాతలు అంతా ఒక్క మాట మీదకు వస్తేనే పని జరుగుతుంది. ఎందుకంటె కీలక నటులు, డైరక్టర్లు టీవీ బైట్ లు ఇవ్వాల్సి వుంటుంది. 

రెండో విడత లాక్ డౌన్ మీద క్లారిటీ వస్తే, థియేటర్లు తెరుచుకోవడం మీద క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏ నిర్మాతలు అయినా ఓ నిర్ణయానికి రావడానికి అవకాశం వుంటుంది.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా క‌న‌గ‌రాజు

ఏప్రిల్ 11 ఏపీలో కొత్త చరిత్ర మొదలైన రోజు