ప్రభాస్ లేటెస్ట్ గా సైన్ చేసిన ఆదిపురుష్ సినిమా. ఈ సినిమా వ్యవహారాలు కాస్త ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రామాయణం యుద్దకాండ నేపథ్యంలో కాస్త డిఫరెంట్ గా ముఖ్యంగా విదేశీయలకు కూడా కాస్త ఇంట్రస్ట్ కలిగించే మోడరన్ టచ్ గెటప్ లతో దీన్ని ప్లాన్ చేస్తున్నారు.
దర్శకుడు ఓం రౌత్ గతంలో హిందూ దేశ భక్తి రంగరించిపోసే తానాజీ సినిమాను సూపర్ గా తీసి చూపించారు. ఇప్పుడు మళ్లీ హిందూ మైథాలజీని తెరపైకి తనదైనద స్టయిల్ లో తీసుకువస్తున్నారు. తానాజీ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించిన సైఫ్ ఆలీఖాన్ నే ఇప్పుడు ఈ సినిమాకు కూడా తీసుకున్నారు.
రామాయణంలో రాముడి తరువాత అంతటి ప్రాముఖ్యం వున్న రావణుడి పాత్రను సైఫ్ ఆలీఖాన్ పోషించబోతున్నారు. ఇది కచ్చితంగా కాస్త సెన్సేషన్ అండ్ క్రేజీ కాంబినేషన్ అవుతుంది. కేవలం 70 రోజుల కాల్ షీట్లతో మొత్తం సినిమాను గ్రీన్ మ్యాట్ మీద తీసి, హాలీవుడ్ రేంజ్ లో అత్యంత సహజమైన గ్రాఫిక్స్, త్రీడీ టెక్నాలజీతో ఆదిపురుష్ ను అందించబోతున్నారు.