నన్ను దోచుకుందువంటే సినిమాతో టాలీవుడ్ జనాల దృష్టిని తన వైపు తిప్పుకుంది హీరోయిన్ నభా నటేష్. అసలే హీరోయిన్ల కొరత వుంది. దాంతో ఆ అమ్మాయిపై ఎంక్వయిరీలు స్టార్ట్ అయ్యాయి. తరువాత సినిమాను టక్కున పట్టేసుకుంది నభా. ఈసారి నభా దోచుకోపోయే మనసు ఎవరిదో కాదు. ఫుల్ ఎనర్జీతో నటించి సీనియర్ హీరో రవితేజది.
రవితేజ హీరోగా రామ్ తాళ్లూరి ఓ సినిమా చేయబోతున్నారు. ఆ మధ్య నేలటికెట్ చేసారు కానీ సరైన ఫలితం రాలేదు. అందుకే ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలు డైరక్టర్ చేసిన విఐ ఆనంద్ డైరక్షన్ లో మరో సినిమాను రామ్ తాళ్లూరి ప్లాన్ చేసారు. ఈ ప్రాజెక్టుకు హీరోయిన్ గా నభాను తీసుకున్నారు. నన్ను దోచుకుందువటే సినిమాలో నభా నటన ఫుల్ జోష్ తో వుండడం అన్నది డైరక్టర్ ఆనంద్ ను, హీరో రవితేజను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
విఐ ఆనంద్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు కాస్త వెయిట్ వుంటుంది. చలాకీ తనం వుంటుంది. అవన్నీ నభా పక్కాగా క్యారీ చేయగలదని, ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ చేస్తున్న అమర్ అక్బర్ ఆంధోని సినిమా తరువాత విఐ ఆనంద్ డైరక్షన్ సినిమా వుంటుంది. ఈలోగా నభా నటేష్ తో మరి కొంతమంది డిస్కషన్లు స్టార్ట్ చేసారు.