సుధీర్ బాబు ప్రయోగం

హీరోలు ఫ్యాన్స్ ను కలవడానికి వెళ్లడం అన్నది కామన్. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు లేదా సినిమా విడుదల తరువాత. కానీ ఇలా వెళ్లడానికి నానా హడావుడి ముందుగా ప్రకటించడం, బౌన్సర్లు, ఇలా రకరకాల…

హీరోలు ఫ్యాన్స్ ను కలవడానికి వెళ్లడం అన్నది కామన్. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు లేదా సినిమా విడుదల తరువాత. కానీ ఇలా వెళ్లడానికి నానా హడావుడి ముందుగా ప్రకటించడం, బౌన్సర్లు, ఇలా రకరకాల వ్యవహారాలు వుంటాయి. కానీ హీరో సుధీర్ బాబు ఒక కొత్త ట్రెండ్ కు తెరతీసాడు

తన స్వంత సినిమా 'నన్నుదోచుకుందువటే' ప్రదర్శిస్తున్న థియేటర్లకు మారు వేషం వేసుకుని వెళ్లే కార్యక్రమం స్టార్ట్ చేసాడు. మారువేషంలో వెళ్లి, థియేటర్ల దగ్గర ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఎవరైనా గుర్తుపడితే, వాళ్లతో సరదాగా సెల్ఫీదిగి వచ్చేస్తున్నాడు. గుర్తుపట్టకపోతే సైలంట్ గా వాచ్ చేసి వచ్చేస్తున్నారు.

సిటీలోని థియేటర్లలో శనివారం ఈ విధంగా పర్యటించిన సుధీర్ బాబు, ఆంధ్ర సీడెడ్ ల్లో కూడా ఈ వారం అంతా ఇలాగే పర్యటిస్తాడట. ఏ థియేటర్ కు ఎప్పుడు వచ్చేదీ ముందుగా ప్రకటించరట. చూడాలి ఈ వైరైటీ కార్యక్రమం, ప్లస్ మౌత్ టాక్ కలిసి, సినిమా కలెక్షన్లు ఇంప్రూవ్ చేస్తాయేమో?