Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ - దిల్ రాజు సినిమా ఆలస్యం?

రవితేజ - దిల్ రాజు సినిమా ఆలస్యం?

రవితేజతో సినిమా ప్రకటించాడు టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. కానీ ఇంతవరకు ఇంకా ప్రారంభం కాలేదు. ఎమీ జాక్సన్ హీరోయిన్ అంటూ ఫీలర్ కూడా బయటకు వచ్చింది. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రొడక్షన్ నే డౌట్ గా వుంది అని వినిపిస్తోంది. దీనికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. 

దర్శకుడు వేణు శ్రీరామ్ ఇంకా కథ పూర్తిగా చెప్పలేదని, కాదు, దర్శకుడికి రవితేజకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, దిల్ రాజుకు, రవితేజకు ఇంకా రెమ్యూనిరేషన్ విషయంలో వ్యవహారం సెటిల్ కాలేదని, ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. నైజాంలో బెంగాల్ టైగర్ కు ఎనిమిది కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి కాబట్టి, దిల్ రాజు వెనక్కు తగ్గక పోవచ్చు. 

అయితే అలా అని రవితేజకు నప్పని డైరక్టర్ ను మార్చే అవకాశం లేదు. అందువల్ల అన్నీ సెట్ చేసి, ప్రాజెక్టును పట్టాలెక్కించేసరికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?