Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరి నిజంగా మారిపోయారా?

పూరి నిజంగా మారిపోయారా?

కాస్త రివల్యూషనరీ భావాలు, మంచి వేగవంతమైన పనితనం, సింప్లిసిటీ, ముక్కుసూటిగా మాట్లాడడం ఇలాంటవి దర్శకుడు పూరి జగన్నాధ్ లక్షణాలు. ఇండస్ట్రీ్లో చాలా త్వరగా ఎవరితోనైనా స్నేహం చేయగలగడం పూరి స్టయిల్. అలాంటిది గత కొంత కాలంగా ఆయన ఒక్కోక్యాంప్ కు దూరం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.  నాగ్ తో జతకట్టి సినిమా చేసి చాన్నాళ్లయింది. ఇంట్లో ఇద్దరు యంగ్ హీరోలు వున్నా, పూరి కి చాన్స్ ఇవ్వలేదు. చిరుత తరువాత మెగా క్యాంప్ లో అవకాశం లేదు. 

ఇద్దరమ్మయిలతో తరువాత బన్నీ తో సినిమా లేదు. ఇప్పుడు చేస్తా అన్నా బన్నీ తప్పించుకుంటున్నాడని టాక్. నితిన్ తో వ్యవహారం బెడిసింది. మహేష్ ఇప్పట్లో అసలు పూరి గురించి ఆలోచిస్తాడా అంటే అనుమానమే.పవన్ తో పూరి సంబంధాల సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ప్రతి క్యాంప్ కీ పూరి ఎందుకు దూరం అవుతున్నాడు? సినిమాలు హిట్..ఫట్ సంగతి అలా వుంచితే, అతని స్నేహాలే ఆయనకు శాపాలవుతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అందులో రెండు స్నేహాలు కీలకం. 

ఒకటి చార్మి,రెండు రామ్ గోపాల్ వర్మ. చార్మితో ఆయన స్నేహం ఎంతవరకు అన్నది ఆయనకే తెలియాలి. ఇలాంటి స్నేహాల వల్ల ఆయన వర్క్ మీద గట్టిగా కాన్సన్ ట్రేట్ చేయలేకపోతున్నారని,ముఖ్యంగా షూటింగ్ మీద ఆయనకు వున్న సరదా, కథ, కథనాల మీద కూర్చోవడం లేదని ఓ టాక్. అందువల్లే చిత్రీకరణ స్టయిల్ బాగానే వుంటున్నా, స్క్రిప్ట్ దగ్గర పట్టాలు తప్పేస్తున్నారని ఇండస్ట్రీ లో వినిపించే అభిప్రాయం. సినిమాను సీరియస్ గా తీసుకోరని, ప్రేక్షకులను తక్కువ అంచనా వేస్తారని, ఇదంతా గురువు రామ్ గోపాల్ వర్మ ప్రభావం అని మరో టాక్.

దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ కోరి చేస్తున్నారో, మరి ఎందుకు చేస్తున్నారో కానీ, చేస్తున్న ట్వీట్ లు అన్నీ పూరికి నెగిటివ్ గా మారుతున్నాయి. మెగా క్యాంప్ ను పూరికి కిలోమీటర్ల దూరం చేసింది పూరి ట్వీట్ లు కాక మరేమిటి? పూరి ఎవరితో చేస్తే ఆ హీరో సూపర్ స్టార్ అనే రేంజ్ లో ట్వీట్ చేయడం, అంతటితో ఊరుకోకుండా మిగిలిన హీరోలతో పోల్చుతూ వారిని కించబర్చడం వంటివి వర్మకే చెల్లు. ఆయన బాగానే వుంటున్నాడు. ఎవరూ ఆయనను ఏమీ అనడం లేదు. కానీ పూరి ని దూరం పెడుతున్నారు. 

నిజానికి పూరి చాలా విధాలుగా రామ్ గోపాల్ వర్మను ఆదుకున్నారని ఇంటస్ట్రీలో వినిపిస్తూ వుంటుంది. మరి రామ్ ఆ విశ్వాసంతో, కొన్నాళ్లు పూరికి నష్టం కలిగించే ఈ ట్వీట్ లు ఆపేస్తే మంచింది. మిత్రడు అన్నవాడు మంచి కోరాలి కానీ చెడు కూడదు. కానీ వర్మ ట్వీట్లు నిస్సందేహంగా పూరికి చెడే చేస్తున్నాయి.

ఇప్పుడు పూరి జగన్నాధ్ తన సన్నిహితులకు తాను మారానని సంకేతాలు పంపారని వినికిడి. చార్మిని దూరం పెట్టానని, వర్మతో కూడా ఇక అంతలా కలిసేది లేదని చెబుతున్నారట. ఓ యంగ్ హీరోకు కథ చెప్పాలని, ఎలాగైనా ఆ సినిమా పట్టాలని పూరి చాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఈ మార్పు అని తెలుస్తోంది. కానీ సినిమా జనం నమ్ముతారా? పూరి కూడా మారి ఓ మంచి సినిమా అభిమానులకు అందిస్తారా? కాలమే చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?