బ్రహ్మోత్సవంలో మహేష్ స్టేక్ పెరిగిందా?

మహేష్ బాబు ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. శ్రీమంతుడు సినిమా నుంచి ఆయన తన సినిమాలకు తాను కూడా పార్టనర్ గా మారారు. ఇందుకోసం ఆయన ఓ కంపెనీని ఫ్లోట్ చేయడం, చాలా స్కీమ్ తయారుచేసారు.దాని…

మహేష్ బాబు ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. శ్రీమంతుడు సినిమా నుంచి ఆయన తన సినిమాలకు తాను కూడా పార్టనర్ గా మారారు. ఇందుకోసం ఆయన ఓ కంపెనీని ఫ్లోట్ చేయడం, చాలా స్కీమ్ తయారుచేసారు.దాని వల్ల శ్రీమంతుడు సినిమాతో మంచి రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు అదే స్కీమ్ తో బ్రహ్మోత్సవం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, బ్రహ్మోత్సవంలో పివిపి స్టేక్ తగ్గి, మహేష్ స్టేక్ పెరిగిందని.  దీనికి కారణం, పివిపి పైనాన్స్ పొజిషన్ కాస్త టైట్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి పివిపి చాలా బడా సంపన్నుడు. భారీ ఫైనాన్షియర్ కూడా. అయితే ఇటీవల చాలా విధాల ఆయన డబ్బులు ఇరుక్కుపోయాయని ఇండస్ట్రీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. కొన్ని స్పోర్ట్స్ టీమ్ ల్లో ఆయన భాగస్వామి. ఇప్పటి దాకా తీసిన సినిమాలేవీ ఆయనకు పెద్దగా ఆర్థిక విజయాలు అందించలేదు.  పైగా కాస్త గట్టి దెబ్బలు తీసినవే ఎక్కువ. మొహమాటానికి పోయి, రాఘవేంద్రరావు కొడుకు కాన్సెప్ట్ కు తల ఊపి అందించిన సైజ్ జీరో గట్టి దెబ్బే తీసింది. ఇక పివిపి ఫైనాన్స్ చేసిన సినిమాల్లో కూడా కొంత మొత్తం ఇరుక్కుందని టాక్.

మరోపక్క నాగ్-కార్తీతో భారీ సినిమా తలకెత్తుకున్నారు. అలాగే బెంగుళూరు డేస్ రీమేక్ వుండనే వుంది. ఇలా అన్ని విధాలా పివిపి కార్నర్ కావడంతో బ్రహ్మోత్సవం సినిమాకు బయట ఫైనాన్స్ కూడా తెచ్చారని వినికిడి. అయితే ఈ ఎఫెక్ట్ సినిమా మీద పడకూడదని, మహేష్ బాబు ప్రొడక్షన్ ను తన చేతుల్లోకి తీసుకున్నారని, తన స్టేక్ పెంచారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నమ్రతే ఎక్కువ వ్యవహారాల చక్కబెడతున్నారని అంటున్నారు. మరి ఎంతవరకు నిజం ఈ వార్తలన్నీ అన్నది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.