ఆడియో ఫంక్షన్ ఎప్పుడో, అసలు ఏం జరుగుతోందో తెలియడం లేదని…ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన సంగతి. ఆపై కాదు..కాదు..అక్కౌంట్ ఎవరో హ్యాక్ చేసారన్న సంగతి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల డిస్కషన్ డిఫరెంట్ గా వుంది. హ్యాక్ కాదని, అది ఎన్టీఆర్ స్వయంగా చేసి వుంటారని టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ తరచు ప్రస్టేట్ అవుతున్నారని గత కొంత కాలంగా ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తూ వుంది. పరిస్థితులు అనుకూలించకపోవడం, తాను దగ్గరవుతానన్నా, బాలయ్య అండ్ కో దగ్గరకు తీయకపోవడం, సినిమాలు ఆశించిన మేరకు హిట్ కాకపోవడం వంటివి ఎన్టీఆర్ ను కలవరపెడుతున్నాయి. కిందా మీదా పడి కొరటాల శివను ఒప్పించి, ఆదికి ముందే సినిమా ప్రారంభమైంది అనిపించేసాడు. అయినా కూడా ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో' సినిమా రిజల్ట్ మీదే భవిష్యత్ ఆధారపడి వుంది.
నాన్నకు ప్రేమతో సినిమా మార్కెటింగ్ కు అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అదెలా వుంటుందో? రిజల్ట్ ఎలా వుంటుదో అని ఓ పక్క కలవరం. సేల్స్ ముగిసి, రిలీజ్ డేట్ పక్కా అయితే తప్ప, అడియో ఫంక్షన్ వుండదు. పది రోజులకన్నా ముందుగా అడియో ఫంక్షన్ చేయడం అంత సరైనది కాదు. ఆ లెక్కన ఈ నెలాఖరులో ఫంక్షన్ వుండాలి. సినిమా వ్యవహారాల్లో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిర్మాత ప్రసాద్ పీకల లోతు బిజీగా వున్నారు. ఇంకో పక్క బాలయ్య బాబాయ్ అడియో ఫంక్షన్ ధూమ్ ధామ్ గా జరిగింది.
అలాంటి నేపథ్యంలో ఏం జరుగుతోందో..ఏం జరుగుతోందో..ఎన్టీఆర్ కు కాస్త కంగారుగా వుండి వుంటుందని, రాత్రి వేళ, ఏదో మూడ్ లో ట్వీట్ చేసి వుంటారని, ఆ తరువాత జరిగిన డామేజ్ తలుచుకుని, హ్యాక్ చేసారంటూ నాలుక మడతేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. హ్యాక్ చేస్తే, ఏవేవో ట్వీట్ చేస్తారని, కేవలం సినిమా గురించి, రాంగ్ గా పోస్టు చేయడానికి హ్యాక్ చేయడం అంటే కాస్త కామెడీగా వుంటుందని టాక్.
మొత్తం మీద నాన్నకు ప్రేమతో సినిమాకు ఒక విధమైన పబ్లిసిటీ వచ్చిందనే నుకోవాలి ఈ ఉదంతంతో.