Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ మీద వంద కోట్లు అంటే...?

రవితేజ మీద వంద కోట్లు అంటే...?

ఈ మధ్య తెలుగు సినిమాకు పాన్ ఇండియా అనే మత్తు అలుముకుంది. దర్శకులు, రైటర్లు, హీరోలు ఎవర్ని కదిలించినా పాన్ ఇండియా అంటున్నారు. అయితే తెలుగు సినిమాను హిందీ జనాలు కొనుక్కుని ఎలాగూ అక్కడి చానెళ్లలో వేసుకుంటున్నారు. అలాగే యూ ట్యూబ్ లో పెడుతున్నారు. బాగుంటే తమిళ, కన్నడ, మలయాళ రైట్స్ అమ్ముడు పోతున్నాయి. 

ఇలా కాకుండా ఏకంగా తెలుగు నిర్మాతే అన్ని భాషల్లో తీసేయడం అన్నమాట. ఇలాంటి సినిమాలకు కాస్త భారీగా ఖర్చువుతుంది. కథ అలాగే వుండాలి. దానికి తగ్గ హీరో వుండాలి. రాజమౌళి విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ చేయాలన్నది కథకుడు విజయేంద్ర ప్రసాద్ ఆలోచన. ఆ మేరకు ఆయన లైన్ తయారు చేసి వుంచుకున్నారు.

రవితేజతోనే చేయాలని కోరిక. కానీ సమస్య ఏమిటంటే దానికి బడ్జెట్ మామూలుగా కాదు. వందకోట్ల పైమాటే. కానీ రవితేజతో అంత బడ్జెట్ అంటే నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఓ నిర్మాత కాస్త ఆసక్తిగా వున్నా, ఆయన అంత రేంజ్ పెట్టుబడి పెట్టగలరా? వంద కోట్లకు పైబడిన బడ్జెట్ సినిమాను హ్యండిల్ చేయగలరా?  అన్న అనుమానాలతో విజయేంద్ర ప్రసాద్ అటు ఇటు ఊగుతున్నారని తెలుస్తోంది. 

అన్నట్లు ఈ ప్రాజెక్టును దర్శకుడు సంపత్ నందితో చేయించాలన్నది ఆయన ఆలోచన. చేయడానికి ఈయన రెడీ, హీరోగా రవితేజ రెడీ, కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ రెడీ. కావాల్సిందల్లా వందకోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలిగిన నిర్మాత. అది కూడా రవితేజ మీద. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?