Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రికార్డుల దిశగా ఎఫ్ 2

రికార్డుల దిశగా ఎఫ్ 2

సంక్రాంతికి ఆలస్యంగా వచ్చినా, కలెక్షన్లు అదరగొట్టేస్తున్న ఎఫ్ 2 కొన్నిచోట్ల రికార్డులు క్రియేట్ చేస్తోంది. భారీ సినిమాల మాదిరిగా యాభైకోట్ల రేంజ్ కు అప్పుడే వెళ్లలేకపోయినా, ఫస్ట్ వీక్, సిటీ షేడ్ లాంటి రికార్డులను క్రియేట్ చేస్తోంది. కాకినాడలో తొలివారం షేర్స్ లో ఎఫ్ 2 భరత్ అనే నేను, రంగస్థలం, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ లాంటి వాటిని అధిగమించింది.

తొలివారం వసూళ్లలో కాకినాడ టౌన్ లో నాలుగో ప్లేస్ లో కూర్చుంది. అక్కడ ఎఫ్ 2 తొలివారం కోటికి పైగా వసూలు చేసింది. ఈ ఫీట్ ను బాహుబలి రెండుభాగాలు, ఖైదీ నెంబర్ 150 మాత్రమే సాధించాయి. చాలా పట్టణాల్లో వినయ విధేయ కలెక్షన్లను దాటేస్తోంది. తాడేపల్లి గూడెంలో ఆరో రోజు కలెక్షన్లు, ఏడో రోజు కలెక్షన్లు సిటీ రికార్డుగా నమోదయ్యాయి.

ఎఫ్ 2 సినిమా తొలివారమే ఓవర్ సీస్ తో సహా దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. ఉత్తరాంధ్ర కలెక్షన్ల షేర్ తొలివారమే అయిదుకోట్ల సమీపంలోకి వచ్చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్ రికార్డులో ఎఫ్ 2 బాహుబలి2, రంగస్థలం తరువాత మూడో ప్లేస్ లో నిల్చుంది.

ఈ ఊపు చూస్తుంటే నైజాంలో భారీ సినిమాల రేంజ్ కు ఎఫ్ 2 వెళ్లేలా కనిపిస్తోంది. నైజాంలోనే కాదు, ఉత్తరాంధ్ర, వెస్ట్, ఈస్ట్ ల్లో కూడా టోటల్ రన్ లో టాప్ ఫైవ్ లోపలకు వచ్చేలా కనిపిస్తోంది.

ఇదేం సినీ అభిమానం.. ఏ రాతి యుగంలో ఉన్నాం?!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?