రీమేక్ ఇవ్వడానికీ జంకుతున్నారు

నాలుగు సినిమాలు మూడుఫ్లాపులు. ఇంక అయిదో సినిమా ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారు? ఎవరైనా? అద్భుతం జరగాల్సిందే. దర్శకుడు సుధీర్ వర్మ విషయంలో ఇదే పరిస్థితి అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రణరంగం సినిమాతో అప్పటి…

నాలుగు సినిమాలు మూడుఫ్లాపులు. ఇంక అయిదో సినిమా ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తారు? ఎవరైనా? అద్భుతం జరగాల్సిందే. దర్శకుడు సుధీర్ వర్మ విషయంలో ఇదే పరిస్థితి అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రణరంగం సినిమాతో అప్పటి వరకు హిట్ లు, ఫ్లాపులు ఎలావున్నా ఆర్థిక నష్టం ఎరుగని సితార ఎంటర్ టైన్మెంట్స్ కు అయిదుకోట్ల లాస్ ఇచ్చాడు ఆయన.

తన కొడుకు నితిన్ తో రీమేక్ చేయాలని అంథాదూన్ సినిమాను కొన్నారు సుధాకరరెడ్డి. కానీ ఎవరు డైరక్టర్ అని వెదుకులాట జరుగుతోంది. సుధీర్ వర్మ పేరు పరిశీలనకు వచ్చినా, మూడు వరుస ఫ్లాపుల కారణంగా మార్కెటింగ్ సమస్యలు వస్తాయని వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతకన్నా ఈ మధ్య ఒక్క మంచి సినిమా చేసిన యంగ్ డైరక్టర్లు ఎవరైనా దొరుకుతారా? అని వెదుకులాడుతున్నట్లు బోగట్టా. వాస్తవానికి సుధీర్ వర్మ టేకింగ్ బాగానే వుంటుంది. స్క్రిప్ట్ లతోనే సమస్య. అంథాదూన్ సినిమా సుధీర్ వర్మ బాగానే రీమేక్ చేసే అవకాశం వుంది.

కానీ తీరా సినిమా మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి మైనస్ అవుతుందని నిర్మాతలు వెనుక అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ, స్వరూప్ లాంటి యంగ్ టాలెంటెడ్ డైరక్టర్లు ఎవరైనా దొరుకుతారా? అని చూస్తున్నట్లు తెలుస్తోంది.

సైరా 'గ్రేట్ ఆంధ్ర' స్పెషల్ స్టోరీ