సందీప్ కిషన్ మాస్ క్రౌడ్ పుల్లర్ గా, మారదామనే ప్రయత్నంలో చేసిన సినిమా జోరు. ఇంతవరకు డిఫరెంట్ జోనర్ లు వెదక్కుని మరీ చేసిన సందీప్, రోటీన్ మాస్ ఎంటర్ టైనర్ చేస్తే ఓపెనింగ్స్ వస్తాయని, కలెక్షన్లు బాగుంటాయని అనుకున్నుడు. ఆ దిశగానే సినిమాను నడిపించాడు. ముగ్గురు ముద్దుగుమ్మలు, కాస్త ఎరోటిక్ సాంగ్ వగైరా అంశాలతో. కానీ కామెడీ పండుతోందా, కథనం ఎలా వుంది అన్నది మరి కాస్త చూసుకోవాల్సింది.
దీంతో సినిమాపై అటు ఇటు కాని టాక్ వచ్చింది. కానీ చిత్రంగా సినిమా ఓపెనింగ్స్ మాత్రం బాగున్నాయట. మొత్తం రెండు స్టేట్ లు కలిపి బాగానే షేర్ లాగిందట. పైగా ఈవారమే విడుదలైన బ్రదర్ సినిమా కన్నా కాస్త బెటర్ ఓపెనింగ్స్ అనిపించుకోవడం చిత్రం. అయితే సాయంత్రానికి టాక్ వచ్చాక బ్రదర్ మళ్లీ స్టేబుల్ అయిందట. దీంతో కొత్త ట్రయిలర్లు కట్ చేసి, ఫబ్లిసిటీని వాడుకునే పనిలో పడింది జోరు టీమ్. ఆ సినిమా బడ్జెట్ కు అలా అలా ఈ వారం బండి లాగించేసినా సరిపోతుంది.
Watch Brother Of Bommali Public Talk
కానీ బ్రదర్ బడ్జెట్ వేరు. దాని స్టార్ కాస్ట్ వేరు. అయితే శాటిలైట్ రేట్లు కూడా వేరు. బ్రదర్ కు నాలుగుపైన శాటిలైట్ వచ్చింది కాబట్టి, ప్రాజెక్ట్ అక్కడ సేఫ్ అయింది. జోరుకు పెట్టిన బడ్జెట్ కు సగం శాటిలైట్ తెగ్గొట్టింది కాబట్టి వాళ్లు సేఫ్. రెండు సినిమాలకు మిగిలింది ఒక్కటే..బయ్యర్లు సేఫ్ కావడం.