పవన్‌కళ్యాణ్ మాజీ భార్య, మాజీ నటి రేణు దేశాయ్ తాను తీసిన మరాఠీ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తోంది. ‘ఇష్క్ వాలా లవ్’ అనే పేరుతో మరాఠీలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోను అదే పేరుతో అనువదించింది. ఇందులో పవన్ తనయుడు అకిరానందన్ అతిథి పాత్ర చేయడంతో పవర్‌స్టార్ అభిమానులు కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ చిత్రానికి పబ్లిసిటీ కోసమని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పవన్ పేరుని బాగానే వాడుకుంది. అన్నిటికీ మించి అకిరానందన్ తొలి సినిమా అంటూ తెగ ఊదరగొట్టేసింది. తనకి పవన్ పేరు చెప్పుకుని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటూనే అతని పేరుని ఫుల్‌గా వాడేసుకుంది. ఆమె వేసిన ఎత్తులు పబ్లిసిటీ అయితే తెచ్చిపెట్టాయి కానీ అవి కలెక్షన్స్‌గా ఎంతవరకు కన్వర్ట్ అవుతాయనేది తేలాల్సి ఉంది.
తెలుగులో కొన్ని చెప్పుకోతగ్గ చిత్రాలు రిలీజ్ అవుతోన్న డేట్‌కే రేణు దేశాయ్ కూడా తన డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఒక లైలా కోసం, కరెంట్ తీగలాంటి చిత్రాలకే ప్రేక్షకులు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. చూసి చూసి ఇలాంటి కాంపిటీషన్ మధ్య తన సినిమా రిలీజ్ చేస్తోన్న రేణుదేశాయ్ దీంతో ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో మరి!