రేపే ‘బిగ్’ డే

ఎన్టీఆర్ యాంకరింగ్ చేస్తున్న బిగ్ బాస్ షో హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా.. లేక సోసోగా నడుస్తోందా.. ఏ విషయం రేపు తేలిపోతుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో రేటింగ్స్…

ఎన్టీఆర్ యాంకరింగ్ చేస్తున్న బిగ్ బాస్ షో హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా.. లేక సోసోగా నడుస్తోందా.. ఏ విషయం రేపు తేలిపోతుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో రేటింగ్స్ రేపు రాబోతున్నాయి. ప్రసారమైన మొదటి రోజు నుంచి ఈ రియాలిటీ షో అందరి నోళ్లల్లో నానుతూనే ఉంది.

కొందరు తిడుతున్నారు.. మరికొందరు పొగుడుతున్నారు.. ఇంకొందరు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ కొట్టిపారేస్తున్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న వాళ్లలో ఎంతమంది చూస్తున్నారనేదే ప్రశ్న. ఎందుకంటే తిట్టినా, పొగిడినా స్టార్ మాకి అనవసరం. అంతిమంగా మంచి రేటింగ్ వచ్చిందా లేదా అనేదే ముఖ్యం.

తెలుగులో ఇప్పటివరకు అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న రియాలిటీ ఇదే. పైగా ఎన్టీఆర్ హోస్టింగ్ కు ఒప్పుకున్నాడు. మరీ ముఖ్యంగా హిందీలో ఇప్పటికే బిగ్ హిట్ అయిన కార్యక్రమం. ఇంత భారీ కార్యక్రమం తెలుగులో క్లిక్ అవుతుందా అవ్వదా అనేదే అందరి సందేహం.

నిజానికి బిగ్ బాస్ తరహా బోల్డ్ రియాలిటీ షో తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్త. ఇప్పటివరకు కామెడీ షోలు, కన్నీళ్లు తెప్పించే కార్యక్రమాలు, డాన్స్ కాంపిటిషన్లు మాత్రమే చూశారు తెలుగు ఆడియన్స్. బిగ్ బాస్ అనేది ఇక్కడి ప్రేక్షకులకు పూర్తిగా కొత్త జానర్. ఇలాంటి జానర్ పై భారీ పెట్టుబడి పెట్టిన స్టార్ మా ప్రస్తుతం ఊపిరి బిగబట్టి రేటింగ్స్ కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆ ఛానెల్ కు ఇది ఇజ్జత్ కా సవాల్.