రేపు కాటమరాయుడు రికార్డు సృష్టిస్తాడట..?

తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు. కొందరు రక్తదానాలు చేస్తారు. మరికొందరు అన్నదానాలు చేస్తారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం అంతకుమించి. తమ హీరో కోసం ఫ్యాన్స్ అంతా హౌజ్ ఫుల్ కలెక్షన్లు…

తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు. కొందరు రక్తదానాలు చేస్తారు. మరికొందరు అన్నదానాలు చేస్తారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం అంతకుమించి. తమ హీరో కోసం ఫ్యాన్స్ అంతా హౌజ్ ఫుల్ కలెక్షన్లు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఏ హీరోకు ఇలా జరగలేదు. ఇకముందు జరుగుతుందన్న గ్యారెంటీ కూడా లేదు.

కాటమరాయుడు సినిమా హంగామా ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పడిపోయాయి.  డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు గ్యారెంటీ అనే విషయాన్ని పక్కనపెడితే, పవన్ సృష్టించాల్సిన రికార్డులు ఇంకా చాలా మిగిలిపోయాయని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అందుకే రేపు ఈ సినిమాను మరోసారి భారీస్థాయిలో చూసి అన్ని థియేటర్లను హౌజ్ ఫుల్ చేయాలని నిర్ణయించుకున్నారు. తమ పవనిజం చూపించాలని ఫిక్స్ అయిపోయారు. ఈ మేరకు ఫ్యాన్స్ అందరికీ వర్తమానాలు అందిపోయాయి. సోషల్ మీడియా ద్వారా షేరింగ్ లు జరిగిపోయాయి. 

ఫ్యాన్స్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయమైతే బాగానే ఉంది కానీ, మొదటి రోజు వచ్చినన్ని వసూళ్లు మాత్రం రేపు గ్యారెంటీగా రావు. ఎందుకంటే గురు, చెలియా లాంటి సినిమాల రాకతో కొన్ని థియేటర్లలో కాటమరాయుడు చిత్రాన్ని ఎత్తేశారు. మరీ ముఖ్యంగా సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే అదనంగా మరో 25 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. ఇంత మొత్తం ఈ టైమ్ లో రావడం దాదాపు అసాధ్యం.