ఆర్ఆర్ఆర్ మాక్ షూటింగ్

కరోనా నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మాక్ షూట్ చేయబోతున్నారు. యాభై మంది క్రూతో ఆర్ఆర్ఆర్ మాక్ షూట్ ను శనివారం ప్లాన్ చేసారు. దాదాపు 200 మందికి పైగా చేయాల్సిన షూట్ ను యాభై…

కరోనా నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మాక్ షూట్ చేయబోతున్నారు. యాభై మంది క్రూతో ఆర్ఆర్ఆర్ మాక్ షూట్ ను శనివారం ప్లాన్ చేసారు. దాదాపు 200 మందికి పైగా చేయాల్సిన షూట్ ను యాభై మందితో ఎలా చేయాలి? కరోనా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రాక్టికల్ ప్రోబ్లమ్స్ ఎలా వుంటాయి? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ మాక్ షూట్ ను చేస్తున్నారు. ఒక వేళ శుక్రవారం సాధ్యం కాకపోతే, సోమవారం చేస్తారు. 

ఇలా తీసిన ఫుటేజ్ ను ఇరు ప్రభుత్వాలకు చూపించే అవకాశం వుంది. మాక్ షూట్ కు ఒకరిద్దరు అగ్ర దర్శకులు హాజరవుతారని వినిపిస్తోంది. లేదూ అంటే ఈ ఫుటేజ్ ను వాళ్లకు పంపిస్తారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలతో షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. అయితే అందులో నిబంధనలు ఆచరణ సాధ్యంగా లేవు అని చాలా మంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయమై ఈరోజు సాయంత్రం జరిగిన గిల్డ్ జూమ్ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. ఈ రూల్స్ అన్నీ గిల్డ్ నే తయారుచేసి ఇచ్చిందని, ముందు స్టార్ట్ చేసి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిబంధనలు సడలించుకోవచ్చని గిల్డ్ పెద్దలు చెప్పారు.

ఇదిలా వుంటే దగ్గుబాటి సురేష్ బాబు సారథ్యంలో అల్లరి రవిబాబు ఓ చిన్న సినిమా షూట్ ను జస్ట్ 20 మందితో ఇటీవల శాంపిల్ గా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కూడా గిల్డ్ మీటింగ్ లో వెల్లడయింది. ఇవి కాక థియేటర్ల పరిస్థితి ఏమిటి?  ఆంధ్ర సిఎమ్ రెస్సాన్స్ వంటివి కూడా గిల్డ్ జూమ్ సమావేశంలో చర్చకు వచ్చాయి. వైఎస్ జగన్ చాలా సాదరంగా ఆహ్వానించి, చాలా అనుకూలంగా మాట్లాడారని గిల్డ్ పెద్దలు మిగిలిన సభ్యులకు తెలిపారు.

నువ్వు ఎలాంటోడివో మీ అబ్బాయే చెప్పాడు