బాలీవుడ్ బిగ్ బ్రేక‌ప్.. పెళ్లి విష‌యంలోనే గొడ‌వ‌?

గ‌త ఐదారేళ్ల నుంచి త‌మ ప్రేమ వ్య‌వ‌హారంతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచారు టైగ‌ర్ ష్రాఫ్, దిశా ప‌టానీ. బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ హీరోహీరోయిన్లు ఇన్నాళ్ల పాటు ప్రేమ‌లో మునిగి తేలారు. త‌మ…

గ‌త ఐదారేళ్ల నుంచి త‌మ ప్రేమ వ్య‌వ‌హారంతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచారు టైగ‌ర్ ష్రాఫ్, దిశా ప‌టానీ. బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ హీరోహీరోయిన్లు ఇన్నాళ్ల పాటు ప్రేమ‌లో మునిగి తేలారు. త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి దాచుకోవ‌డానికి వీరు మొద‌టి నుంచి వెనుకాడ‌లేదు. 

రిసార్ట్స్ లో స్టే చేసే స‌మ‌యాల్లో వేర్వేరుగా ఫొటోల‌ను పెట్టినా.. ఒక‌టే ప‌రిస‌రాల్లో తాము ఉన్న‌ట్టుగా క్లూస్ ఇచ్చి వీరు త‌మ ప్రేమ గురించి లీక్ చేశారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా వీరిద్ద‌రూ జంట‌గా తిర‌గ‌సాగారు. ఆరేళ్ల నుంచి వీరి ప్రేమ క‌థ ఇలా కొన‌సాగుతూ వ‌చ్చింది.

మ‌రి ఈ వ‌య‌సులో ఇన్నాళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారంటే అదేమీ చిన్న సంగ‌తి కాదు. అయితే గ‌త కొన్ని రోజుల నుంచి వీరి బ్రేక‌ప్ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్రేమ ప‌క్షులు విడిపోయాయ‌ని.. చెరో దారి చూసుకున్నార‌నేది టాక్ ఆఫ్ ద టౌన్. అయితే ఇందుకు అధికారిక ధ్రువీక‌ర‌ణ లేదు. ఈ అంశంపై టైగ‌ర్ ష్రాప్ తండ్రి జాకీ కూడా స్పందించారు. వారిద్ద‌రూ ఈ మ‌ధ్య‌నే క‌లిసి తిర‌గ‌డాన్ని కూడా త‌ను చూసిన‌ట్టుగా జాకీ స్పందించారు. 

త‌న త‌న‌యుడి ప్రేమ వ్య‌వ‌హారంలో త‌ను మ‌రీ ఎక్కువ‌గా త‌ల‌దూర్చ‌న‌న్న‌ట్టుగా కూడా జాకీ స్ప‌ష్టం చేశాడు. విడిపోయినా లేదా వారు క‌లిసి ఉన్న విష‌యాన్ని జాకీ ష్రాప్ ధృవీక‌రించ‌లేదు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. పెళ్లి విష‌యంలో భిన్నాభిప్రాయాలే వారు విడిపోవ‌డానికి కార‌ణం అనే టాక్ వినిపిస్తూ ఉంది. దిశ‌కు పెళ్లి మీద గాలి మ‌ళ్లింద‌ని, వివాహం చేసుకుందామంటూ టైగ‌ర్ తో ప్ర‌తిపాదించింద‌ని, అయితే అందుకు అత‌డు నిరాక‌రించాడ‌ని, దీంతోనే వారి మ‌ధ్య దూరం పెరిగిన‌ట్టుగా ముంబై స‌మాచారం. 

ఈ మ‌ధ్య‌నే బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు కూడా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. అలియా భ‌ట్, ర‌ణ్ బీర్ క‌పూర్ లు అలానే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వార‌య్యారు. త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కూడా కాబోతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో దిశ‌కు కూడా పెళ్లిపై ఆస‌క్తి మొద‌ల‌యి ఉంటే పెద్ద ఆశ్చ‌ర్యం లేదు!

త‌మ తోటి న‌టీన‌టులు ప్రేమ క‌థ‌ల‌ను పెళ్లి దిశ‌గా సాగిస్తూ ఉన్న‌ప్పుడు దిశ‌కు కూడా ఇలాంటి ఆలోచ‌న వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. అయితే టైగ‌ర్ అందుకు నిరాక‌రించ‌డంతోనే వీరి ప్రేమ‌క‌థ బ్రేక‌ప్ దిశ‌గా సాగుతోంద‌నేది పుకార్ల సారాంశం. మ‌రి అస‌లు క‌థేమిటో!