గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా విషయంలో హీరో బాలకృష్ణ కాస్త రెస్ట్ లెస్ గా పనిచేసారు. సినిమా షూట్ ఇతరత్రా వ్యవహారాలు ఒక ఎత్తు. ప్రమోషన్ మరో ఎత్తు. ఈ సినిమా ప్రమోషన్ కు బాలయ్య చాలా అంటే చాలా కష్టపడ్డారు. సభలు, సమావేశాలు, ఇంటర్వూలు, ప్రెస్ మీట్లు, టూర్ లు ఇలా ఒకటేమిటి? సవాలక్ష.
దీంతో ఆయన బాగా అలసిపోయారట. కనీసం ఓ నెల అన్నా రెస్ట్ తీసుకున్న తరువాతే మళ్లీ సినిమాల గురించి ఆలోచిస్తారట. నెల విశ్రాంతి అనంతరమే బాలయ్య తన 101 వ సినిమా గురించి ఆలోచిస్తారట. అప్పుడు మాత్రమే ఏ నిర్ణయమూ తీసుకుంటారట. రైతు సినిమా పై ఇప్పటికి అయితే ఎస్ ఆర్ నో అన్న క్లారిటీ లేదు.
బోయపాటి ని 2019 ఎన్నికల ముందు చేయబోయే సినిమాకు రిజర్వ్ చేసేసారు. అందువల్ల ఇప్పుడు మరెవరితో సినిమా అన్నది నెల రోజుల విశ్రాంతి తరువాతనే డిసైడ్ చేస్తారట బాలయ్య. ఇదిలా వుంటే గత ఏడాది బాలయ్యకు మాంచి హిట్ ఇచ్చిన డైరక్టర్ శ్రీవాస్ కూడా బాలయ్య కోసం ఓ మాంచి సబ్జెక్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.