ఎస్..ఎస్..ఇది కాస్త ఓవర్ గా లేదూ?

ఎదిగిన కొద్దీ ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ప్రపంచం వారి పట్ల అబ్బురంగా చూస్తుంది. కానీ టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన రాజమౌళి వ్యవహారం భిన్నంగా వుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమావిషయంలో…

ఎదిగిన కొద్దీ ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ప్రపంచం వారి పట్ల అబ్బురంగా చూస్తుంది. కానీ టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన రాజమౌళి వ్యవహారం భిన్నంగా వుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమావిషయంలో ఆయన చేస్తున్న ఫీట్లు కాస్త ఓవర్ అనిపిస్తున్నాయి.

మంచి సినిమా, బాగుంది అని ట్వీట్ లు చేయడం వరకు ఓకె. ఓ మంచి సినిమాను మంచిగా చెప్పడం అన్నది మంచిదే కాబట్టి అందరూ ఓకె అనుకున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ క్రిష్ ను ఇంటర్వూ చేసారు. సరే, అభిమానంతో చేసారు కాబట్టి, అది కూడా ఇంట్రెస్టింగ్ అని అనుకున్నారు. ఓకె. కానీ ఇప్పుడు ఇవన్నీ చేసాక, క్రిష్ కు బహిరంగ లేఖ అంటూ రాయడం, దాన్ని మీడియాకు వదలడం కాస్త ఓవర్ గా వుంది.

 పైగా రాజమౌళి లాంటి వాళ్ల లెవెల్ కు తగినట్లు లేదు ఆ లెటర్ కానీ అందులోని అక్షర ప్రయోగాలు కానీ. చాలా సాదా సీదా గా వున్నాయి. దీంతో ఏదో పని గట్టుకుని గౌతమీ పుత్రుడిని ప్రమోట్ చేయడానికి రాజమౌళి తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది తప్ప, నిజాయతీ తొంగి చూడడం లేదు.

పైగా ఎప్పుడయితే అమరావతి కి డిజైన్లు ఇచ్చే పని రాజమౌళికి అప్పగించారని జనానికి తెలుసిందో, ఇలాంటి నిజమైన ప్రమోషన్లను కూడా ఆ ఏంగిల్ లో చూడడం కామన్ అయిపోతుంది. అందువల్ల రాజమౌళి కాస్త ఆచి తూచి స్పందించడం అలవాటు చేసుకోవాలి.