ఆర్జీవీ చూపించిన బూతు మార్గం

ఒకరు ఎవరైనా ఏదో ఒకటి కొత్తగా చేసి, నాలుగు డబ్బులు చేసుకున్నారు అంటే చాలు, బొలోమని ఆ దారిలోకి వెళ్లిపోతారు. ఇక తామరతంపరగా అదే తరహా వ్యవాహారాలు నడుస్తాయి. గతంలో దర్శకుడు మారుతి ఈ…

ఒకరు ఎవరైనా ఏదో ఒకటి కొత్తగా చేసి, నాలుగు డబ్బులు చేసుకున్నారు అంటే చాలు, బొలోమని ఆ దారిలోకి వెళ్లిపోతారు. ఇక తామరతంపరగా అదే తరహా వ్యవాహారాలు నడుస్తాయి. గతంలో దర్శకుడు మారుతి ఈ రోజుల్లో, బస్ట్ స్టాప్ అనే చిన్న సినిమాలు తీసినపుడు, అవి ఎందుకు  సక్సెస్ అయ్యాయో అన్నది గమనించలేదు. అందులో బూతు కంటెంట్ ను మాత్రం పట్టుకుని, ఇక పదుల సంఖ్యలో అలాంటి సినిమాలు వచ్చేసాయి. దాదాపు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసాయి.

ఇప్పుడు ఆర్జీవీ ఓ కొత్త మార్గానికి తెరతీసారు. నాలుగైదు లక్షల్లో సినిమా తీసి, ఆన్ లైన్ లో రెండు వందల  టికెట్ రేటు పెట్టి వదిలారు. గట్టి లాభాలు సంపాదించారు. దీంతో ఇప్పుడు ఈ ఆన్ లైన్ థియేటర్ కాన్సెప్ట్ ను చాలా మంది స్టార్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. చాలా మంది ఔత్సాహికులు, కరోనా టైమ్ లో ఖాళీగా వున్నఔత్సాహిక సినిమా టెక్నీషియన్లు తమ శ్రమ పెట్టుబడిగా పెట్టి, చిన్న చిన్న  సినిమాలు తయారుచేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

అయిదారు లక్షల్లో సినిమా అనగానే చాలా మంది ఇలాంటి వాళ్లను అప్రోచ్ అవుతున్నారు. అయితే ఆన్ లైన్ లో టికెట్ పెట్టి జనం చూడాలి అంటే బూతు కంటెంట్ తప్పదు అనే భావన కూడా బలపడుతోంది. పైగా ఇది దగ్గర దారి, సులువైన మార్గంలా కనిపిస్తోంది. పైగా సెన్సారు లేదు. అందువల్ల భవిష్యత్ లో ఈ ఆన్ లైన్ థియేటర్లు ఇబ్బడిమబ్బడి గా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే మరింత బూత కంటెంట్ విరివిగా అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తోంది.

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్