కరోనాకు మందు కనిబెట్టిన వీవీ వినాయక్!

కరోనాకు సంబంధించి చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు వీడియోలు చేశారు. కొంతమంది మంచి ఆహారం తీసుకోమన్నారు. మరికొంతమంది వ్యాయామం చేయమన్నారు. అంతా మూకుమ్మడిగా మాస్క్ పెట్టుకోమని చెప్పారు. కానీ దర్శకుడు వీవీ వినాయక్ మాత్రం దీనికి…

కరోనాకు సంబంధించి చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు వీడియోలు చేశారు. కొంతమంది మంచి ఆహారం తీసుకోమన్నారు. మరికొంతమంది వ్యాయామం చేయమన్నారు. అంతా మూకుమ్మడిగా మాస్క్ పెట్టుకోమని చెప్పారు. కానీ దర్శకుడు వీవీ వినాయక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఆయన ఓ ఇంజెక్షన్ గురించి మాట్లాడాడు. బహుశా.. కరోనాకు విరుగుడు ఆ ఇంజెక్షన్ తో సాధ్యమౌతుందేమో అనే అనుమానం వ్యక్తంచేశాడు.

తన అనుమానాన్ని, నమ్మకాన్ని బయటపెడతూ కొద్దిసేపటికిందట ఓ వీడియో రిలీజ్ చేశాడు వీవీ వినాయక్. ఇంతకీ ఆ ఇంజెక్షన్ ఏంటో తెలుసా..? ఎల్లో ఫీవర్ అనే వ్యాధి రాకుండా ఇచ్చే ఇంజెక్షన్ అది.

“ఓసారి కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునే క్రమంలో ఎల్లో ఫీవర్ లక్షణాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం.”

రీసెంట్ గా కరోనా నివారణకు సంబంధించి ఇద్దరు వైద్యులు మాట్లాడుకున్న ఆడియో క్లిప్ ఒకటి బాగా వైరల్ అయింది. అందులో వైరస్ శరీరంలో ఎలా వ్యాపిస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం తినాలనే వివరాల్ని ఆ ఇద్దరు డాక్టర్లు చర్చించుకున్నారు. ఆ ఆడియో క్లిప్ వినాయక్ కూడా విన్నాడు.

వాళ్లకు తన ఆలోచన చేరాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాడు వినాయక్. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి ఆ వైద్యులకు చెప్పడమే తన ఉద్దేశమని, ఈ ఇంజెక్షన్ ఏమైనా కరోనా నివారణకు పనికొస్తుందేమోనని అభిప్రాయపడ్డాడు ఈ దర్శకుడు.

డ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు