ఆర్జీవీ అంటే రామ్ గోపాల్ వర్మ అనుకునేరు. కాదు..కాదు..ఈయన రాధా గోపాల్ వర్మ. ఈయన కూడా పవర్ స్టార్ పేరుతో సినిమా తీస్తున్నారట. పవన్ ఫ్యాన్ ఈ ఆర్జీవీ మీద అభిమానంతో నిర్మాతగా వుండబోతున్నారట. కానీ మిగిలిన విషయాలు తెలియవు కానీ, ఏమయిందో ఏమిటో? ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయి హత్యకు గురయిందట.
అసలు ఏమిటి ఇదంతా అంటే, పవన్ ఫ్యాన్ నూతన్ నాయుడు డైరక్షన్ లో నిర్మిస్తున్న పరాన్నజీవి వ్యవహారమే. పరాన్నజీవి సినిమా షూట్ డే అండ్ నైట్ జరుగుతోంది. ఇందులో పాయింట్ నే పైన చెప్పింది. ఈ సినిమాలో హీరోయిన్ మర్డర్ అనే పాయింట్ వుంటుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కే శ్రీరెడ్డిని అడగడం, ఆమె ముందు ఊ అని, లాస్ట్ మినిట్ లో నో చెప్పినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.
మొత్తానికి చూస్తుంటే రాధాగోపాల్ వర్మ అంటూ పరాన్న జీవి కోసం కాస్త గట్టి కథే అల్లినట్లు కనిపిస్తోంది. మిగిలిన కథ,మరిన్ని వివరాలు మరోసారి ముచ్చటించుకుందాం.