విశాఖ కోటాలో జగన్?

కోటా వచ్చేశాక, రిజర్వేషన్లు పెట్టేశాకా ప్రతీదీ ఆ కోణలో చూడడం రాజకీయ జీవులకు  అలవాటుగా మారిపోయింది. ఉత్తరాంధ్రా జిల్లాల విషయానికి వస్తే గత టీడీపీ హయాంలో అయిదు మంత్రి పదవులు దక్కాయి. అందులో విశాఖకు…

కోటా వచ్చేశాక, రిజర్వేషన్లు పెట్టేశాకా ప్రతీదీ ఆ కోణలో చూడడం రాజకీయ జీవులకు  అలవాటుగా మారిపోయింది. ఉత్తరాంధ్రా జిల్లాల విషయానికి వస్తే గత టీడీపీ హయాంలో అయిదు మంత్రి పదవులు దక్కాయి. అందులో విశాఖకు రెండు ఇచ్చారు. అలాగే,  శ్రీకాకుళానికి రెండు దక్కితే విజయనగరానికి ఒకటే ఇచ్చారు.

ఇపుడు జగన్ పాలనలో విజయనగరానికి రెండు మంత్రి పదవులు దక్కితే తాజా భర్తీతో సిక్కోలుకు కూడా రెండు మంత్రి పదవులు లభిస్తున్నాయి. అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖకు మాత్రం ఒక్కటే మంత్రి పదవి దక్కింది. దీంతో విశాఖ రూరల్ జిల్లా నుంచి ట్రై చేసిన వారంతా ఈ జిల్లాకు రెండో మంత్రి పదవి ఇవ్వలేదని మదన పడుతున్నారు.

అయితే దానికి వైసీపీలోనే లాజిక్ తో కూడిన  సమాధానం లభిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అంతటివారే ఇకపైన విశాఖలో కొలువుంటారని అంటున్నారు.  పరిపాలనా రాజధానిగా వైజాగ్ ఆవిర్భవిస్తే సీఎం హోదాలో జగనే ఇక్కడ ఉంటారని, అందువల్ల ప్రత్యేకంగా వేరేగా మంత్రి ఇవ్వలేదన్న బాధే ఉండదని కూడా చెబుతున్నారు.  అలా  రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే విశాఖకే అతి పెద్ద న్యాయం చేసినట్లు అవుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇవన్నీ సరే కానీ భవిష్యత్తులోనైనా తాము మంత్రులము అవుతామని రూరల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ఆశల పందిరిలో విహరిస్తున్నారు. మరి ఎవరి ఆశలు వారివి కదా.

జగనన్న పచ్చ తోరణం

పవన్, లోకేష్ ఓటమి గురించి బండ్ల కామెంట్స్