సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన నటి రియా చక్రబర్తి ఏం చెప్పిందనేది ఆసక్తిదాయకంగా మారింది. రియాకు భారీగా ఆస్తులున్నట్టుగా ఈడీ గుర్తించిందని మీడియాలో ప్రచారం జరిగింది. రియా కు ముంబైలో సొంతంగా ఫ్లాట్ ఉందనే వార్తలు వచ్చాయి. ఆ ఫ్లాట్ ఆమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డబ్బుతో కొని ఉంటుందనే ఊహాగానాలూ వినిపించాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి చేసిన ఫిర్యాదులో తన కొడుకు అకౌంట్ నుంచి భారీగా డబ్బు రియా కుటుంబీకుల ఖాతాల్లోకి బదిలీ అయ్యిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులు నమోదు చేసి రియాను విచారణకు పిలిచినట్టుగా సమాచారం. ఈ క్రమంలో రియా తన ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ పేపర్స్ తో సహా విచారణకు హాజరైందట.
తన పేరున ముంబై లో 85 లక్షల రూపాయల విలువైన ఒక ఫ్లాట్ ఉన్నది నిజమే అని రియా పేర్కొన్నట్టుగా సమాచారం. అందుతో 25 లక్షల రూపాయలు తన ఓన్ సేవింగ్స్ అని ఆమె వివరించిందట. మిగతా డబ్బులు బ్యాంకు లోన్ అని, అందుకు సంబంధించి తను ఈఎంఐలు కడుతున్నట్టుగా రియా వివరించిందట. తను సుశాంత్ కు సంబంధించిన డబ్బు ఉపయోగించుకోలేదని, తన మెయింటెయినెన్స్ కు సంబంధించి కూడా తన సొంత సంపాదనే ఆధారం అని ఆమె వివరించిందట. రియా చక్రబర్తి ఆమె ఐటీ రిటర్న్స్ ను కూడా ఈడీ అధికారులకు సమర్పించిందని, తదుపరి ఎప్పుడు విచారణకు పిలిచినా ఆమె హాజరవుతుందని ఆమె తరఫు లాయర్ మీడియాకు వివరించాడు.
ఇలా తమ వెర్షన్ ను రియా వినిపించినట్టుగా ఉంది. సుశాంత్ తో పాటు తను కూడా రెండు చిన్న సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నట్టుగా కూడా రియా వివరించిందట. మరి ఈ కేసులో ఈడీ అధికారుల విచారణలో ఏం తేలిందనేది ప్రస్తుతానికి ఇంకా మిస్టరీనే!